కొత్త ఫీచర్లతో తక్కువ ధరలో వచ్చిన షియోమీ స్మార్ట్ టీవీలు

కొత్త ఫీచర్లతో తక్కువ ధరలో వచ్చిన షియోమీ స్మార్ట్ టీవీలు
HIGHLIGHTS

షియోమి Mi Tv 4A Horizon ఎడిషన్ ‌ను నేడు భారత్‌ లో విడుదల చేసింది.

Mi Tv 4A Horizon Edition 32-అంగుళాల మరియు 43-అంగుళాల స్క్రీన్ సైజుల్లో లభిస్తుంది.

4A సిరీస్ టీవీలతో పోలిస్తే హారిజన్ ఎడిషన్ అన్నింటిలో కన్నా సన్నని అంచులు కలిగిన డిజైన్‌ అందిస్తుంది.

షియోమి Mi Tv 4A Horizon ఎడిషన్ ‌ను నేడు భారత్‌ లో విడుదల చేసింది. ఇది 32-అంగుళాల మరియు 43-అంగుళాల స్క్రీన్ సైజుల్లో లభిస్తుంది. ఈ టీవీలు వరుసగా HD మరియు FHD రిజల్యూషన్ ‌ను తీసుకువస్తాయి. హారిజోన్ ఎడిషన్ యొక్క అతిపెద్ద ప్రత్యేక ఫీచర్ టీవీ ముందు భాగంలో ఉన్న బెజెల్స్(అంచులు). షియోమి యొక్క మిగిలిన 4A సిరీస్ టీవీలతో పోల్చినప్పుడు హారిజన్ ఎడిషన్ అన్నింటిలో కన్నా సన్నని అంచులు కలిగిన డిజైన్‌ అందిస్తుంది.

కొత్తగా ప్రకటించిన ఈ షియోమి టీవీలు 32-అంగుళాల మరియు 43-అంగుళాల స్క్రీన్ సైజులతో వస్తాయి. Mi Tv 4A Horizon Pro 32-అంగుళాల ధర రూ .12,999 కాగా,  మి టివి 4 ఎ హారిజోన్ ఎడిషన్ ధర 13,499 రూపాయలు. 43 అంగుళాల స్క్రీన్ సైజులో, 4K Mi TV 4X ధర రూ.24,999 రూపాయలు మరియు మి టివి 4 ఎ ప్రో ధర 21,999 రూపాయలుగా ప్రకటించింది. అయితే, కొత్త Mi TV 4A Horizon Edition ధర 22,999 రూపాయలు.

Mi TV 4A Horizon Edition: ఫీచర్స్

పైన చెప్పినట్లుగా, Mi TV 4A హారిజోన్ ఎడిషన్ రెండు స్క్రీన్ సైజుల్లో లభిస్తుంది. వీటిలో 1368 x 768p HD Ready రిజల్యూషన్ ‌తో 32 అంగుళాల టీవీ, FHD  (1920 x 1080) p రిజల్యూషన్‌ తో 43 అంగుళాల టీవీ ఉన్నాయి. ఈ రెండు టీవీలు షియోమి Vivid Picture Engine టెక్నాలజీ, DTS-HD సరౌండ్ సౌండ్‌తో 20W స్టీరియో స్పీకర్లు, క్వాడ్-కోర్ ప్రాసెసర్ + మాలి -450 గ్రాఫిక్స్, 1 జిబి ర్యామ్ + 8 జిబి స్టోరేజ్, వై-ఫై మరియు బ్లూటూత్ 4.2. వంటి ఫీచర్లతో వస్తాయి.

ఈ టీవీలు నెట్ ‌ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియో కోసం హాట్ ‌కీ లతో షియోమి యొక్క మినిమలిస్ట్ రిమోట్ కంట్రోల్‌తో వస్తాయి. దీనికి గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంది.

Mi TV 4A హారిజోన్ ఎడిషన్ షియోమి యొక్క ప్యాచ్‌వాల్ UI లో నడుస్తోంది మరియు టీవీలు మీకు Android TV కి యాక్సెస్ ఇస్తాయి. Android TV తో మీరు యాప్స్ , Google అసిస్టెంట్, Chromecast మరియు మరిన్ని డౌన్ ‌లోడ్ చేయడానికి Play Store వంటి ఫీచర్లు పొందుతారు. ప్యాచ్ ‌వాల్ ‌తో, టీవీ “నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ మొదలైన 23+ కంటెంట్ పార్ట్నర్స్ తో వస్తుంది, 16+ భాషల నుండి కంటెంట్ మరియు అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది”.

ఈ రెండు టీవీలు త్వరలో అన్ని మి స్టోర్స్, మి స్టూడియో మరియు ఆఫ్‌ లైన్ భాగస్వామి స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo