Mi TV Lux OLED: అద్దం లాంటి టీవీలను ప్రకటించిన Xiaomi

Updated on 12-Aug-2020
HIGHLIGHTS

Mi TV Lux OLED టీవీని, షియోమి ప్రపంచంలో మొట్టమొదటి భారీ 55-అంగుళాల మాస్- ప్రొడ్యూస్ ట్రాన్ఫరెంట్ (పారదర్శక) టీవీలు విడుదల చేసింది.

షియోమి యొక్క 10 వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా Mi 10 Ultra మరియు Redmi K30 Ultra స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఈ టీవీని విడుదల చేసింది.

ఈ విధమైన ఫీచర్లతో, టెలివిజన్లను భారీగా తయారు చేసిన మొదటి సంస్థగా షియోమి నిలిచింది.

Mi TV Lux OLED టీవీని, షియోమి ప్రపంచంలో మొట్టమొదటి భారీ 55-అంగుళాల మాస్- ప్రొడ్యూస్ ట్రాన్ఫరెంట్ (పారదర్శక) టీవీలు విడుదల చేసింది. షియోమి యొక్క 10 వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా Mi 10 Ultra మరియు Redmi K30 Ultra స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఈ టీవీని విడుదల చేసింది. క్లియర్ గా చెప్పాలంటే, Xiaomi తీసుకోచైనా ఈ టీవీ  ఆన్ చేసినప్పుడు మీకు Hi-res కంటెంట్ అందిస్తుంది మరియు ఆఫ్ చేసినప్పుడు ఒక గ్లాస్ (అద్దం) మాదిరిగా కనిపిస్తుంది. అంటే, మన కిటికీ అద్దంలాగా అన్నమాట. ఈ విధమైన ఫీచర్లతో, టెలివిజన్లను భారీగా తయారు చేసిన మొదటి సంస్థగా షియోమి నిలిచింది.

షియోమి యొక్క ఈ పారదర్శక 55-అంగుళాల టీవీ LG యొక్క పారదర్శక OLED Digital Signage మీద ఆధారపడి ఉంటుంది. అయితే, LG వీటిని కేవలం  తన బిజినెస్ క్లయింట్స్  కోసం మాత్రమే విక్రయిస్తుంది. ముఖ్యంగా, LG యొక్క ఈ టీవీ 10 టచ్ పాయింట్ల వరకు ఇన్‌పుట్‌కు మద్దతు ఇస్తాయి. Mi TV Lux OLED పారదర్శక టీవీ ధర RMB 49,999, ఇది భారతీయ రూపాయితో పోల్చి చూస్తే సుమారు 5,40,000 రూపాయలకు సమానంగా వుంటుంది. ఈ 55-అంగుళాల Mi TV Lux OLED transparent TV యొక్క ప్రత్యేకతలను పరిశీలిద్దాం.

Mi TV Lux OLED transparent TV : ప్రత్యేకతలు

షియోమి పారదర్శక టీవీ 5.7 మిల్లీమీటర్ల మందం మరియు 55-అంగుళాల HD (1920 x 1080 పిక్సెల్స్) పారదర్శక OLED స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో మరియు 120Hz MEMC చిప్‌ను కలిగి ఉంటుంది. ఇది సున్నితమైన మరియు లాగ్-ఫ్రీ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. ఈ Mi TV Lux ‌లోని 10-బిట్ ప్యానెల్ 1.07 బిలియన్లకు పైగా రంగులను పునరుత్పత్తి చేయగలదు మరియు 93% DCI-P3 కలర్ గ్యాముట్ కి మద్దతు ఇస్తుంది.

ఈ ట్రాస్పరెంట్ టీవీ క్వాడ్-కోర్ A73 CPU తో కస్టమ్ మీడియాటెక్ 9650 చిప్‌ సెట్ శక్తితో పనిచేస్తుంది, ఇది 3GB RAM మరియు 32GB స్టోరేజ్ తో జతచేయబడుతుంది. ఇది AI మాస్టర్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది దృశ్యాలతో సంబంధం లేకుండా ఆటొమ్యాటిగ్గా సీన్స్ ను చక్కగా ట్యూన్ చేస్తుంది, ఇది 20 కి పైగా ప్రీసెట్ ఆప్టిమైజేషన్లతో శక్తివంతమైన చిత్రాలు మరియు వీడియోలను అందిస్తుంది. ఈ టీవీ 1ms వేగవంతమైన ప్రతిస్పందన రేటుకు మద్దతు ఇస్తుంది, ఇది తక్కువ జాప్యంతో ఎటువంటి అంతరాయం లేకుండా టీవీలో గేమ్స్ ఆడటానికి అనుమతిస్తుంది.

Mi TV Lux OLED ఆడియో పరంగా Dolby Atmos కు మద్దతునివ్వడమే కాకుండా, రౌండ్ బేస్‌ లో రెండు 8W స్పీకర్ యూనిట్లతో వస్తుంది. ఈ టీవీ కనెక్టివిటీ విషయంలో, 3 HDMI  పోర్ట్‌లు, AV -ఇన్ పోర్ట్, 2USB 2.0 పోర్ట్‌లు, ఆప్టికల్ ఇన్‌పుట్, ఈథర్నెట్ పోర్ట్ మరియు యాంటెన్నా పోర్ట్‌ లను కలిగి ఉంటుంది.

షియోమి యొక్క పారదర్శక టీవీ టీవీ సొంత MIUI లో నడుస్తుంది మరియు స్ట్రీమింగ్ యాప్స్ మరియు ఇతర యుటిలిటీలతో ప్రీలోడ్ చేయబడింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :