ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ Westinghouse ఈరోజు ఇండియాలో తన కొత్త స్మార్ట్ టీవీలను పరిచయం చేసింది. ఈ కొత్త టీవీలను 32, 43 మరియు 50 పరిమాణంలో HD మరియు UHD రిజల్యూషన్ తో అందించింది. వీటిలో, 32 ఇంచ్ HD Ready టీవీని కేవలం 7,999 రూపాయల ధరకే ప్రకటించింది. అయితే, ఇది నాన్-స్మార్ట్ టీవీ కాగా, 4K UHD మోడల్‌లు పిక్చర్ క్వాలిటీ, సౌండ్ టెక్నాలజీ మరియు స్మార్ట్ ఫీచర్ లలో సరికొత్త పురోగతులతో వస్తాయి. ఈ కొత్త స్మార్ట్ టీవీల ప్రత్యేకతలు మరియు ధర వివరాలను గురించి వివరంగా చూద్దామా.
పైన తెలిపిన విధ్దంగా, 32 ఇంచ్ HD Ready టీవీ నాన్- స్మార్ట్ టీవీ 2 HDMI, 2 USB పోర్ట్‌లతో వస్తుంది. ఈ టీవీ MP3/WMA ఆడియో ఫార్మాట్‌లకు మద్దతు ఇచ్చే ఆడియో ఈక్వలైజర్ ను కలిగివుంది మరియు 20W సౌండ్ అవుట్ ఫుట్ ఇస్తుంది. ఈ టీవీ గరిష్టంగా 350 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు మరియు మంచి పిక్చర్ క్వాలిటీ ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ఇక 43 మరియు 50 ఇంచ్ టీవీల విషయానికి వస్తే, ఇవి రెండు కూడా 4K UHD రిజల్యూషన్ కలిగిన స్మార్ట్ టీవీలు. వీటిలో, 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ధర రూ.20,999 రూపాయలు కాగా, 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ధర రూ.27,999 రూపాయలు. ఈ టీవీలు 2GB RAM, 8GB ROM, 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్ లను కలిగి ఉంటాయి. ఈ రెండు టీవీలు కూడా మంచి విజువల్స్ అందించడానికి వీలుగా HDR 10 సపోర్ట్ తో వస్తాయి.
ఇక సౌండ్ పరంగా, ఈ రెండు టీవీలు కూడా డిజిటల్ నాయిస్ ఫిల్టర్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీకి మద్దతు ఇచ్చే 40-వాట్ స్పీకర్ అవుట్‌పుట్ ను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన పనిచేస్తాయి మరియు వినియోగదారులు Google Play Store ద్వారా అనేక Apps మరియు Game లకు యాక్సెస్‌ను పొందవచ్చు.
మార్కెట్లోకి లేటెస్ట్ గా వచ్చిన ఈ టీవీలు జూన్ 13 నుండి అమెజాన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.