ప్రీమియం టెలివిజన్ విభాగంలో అగ్రగామి అయిన Vu టెలివిజన్ కొత్తగా Vu Cinema Smart TV ని ప్రారంభించింది. దీనితో పాటు, ఈ టీవీ సహాయంతో సినిమా అభిమానులు తమ ఇళ్లలో సురక్షితంగా ఉంటూనే ఉత్తమ సినిమా అనుభవాన్ని మరియు ఆడియో-విజువల్ అనుభవాన్ని పొందేలా ఈ కంపెనీ జాగ్రత్త తీసుకుంది. 'బెస్ట్-ఇన్-క్లాస్' స్మార్ట్ టీవీని జూన్ 23, 2020 న ప్రకటించింది మరియు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అమ్మబడుతుంది. టెక్నాలజీ మరియు ఫీచర్ల పరంగా తన వినియోగదారులకు ఉత్తమమైన వాటిని అందించే ఖ్యాతిని కలిగివున్న ఈ కంపెనీ తన Vu Cinema Smart TV ని ఉత్తమ 4K ఫీచర్లతో స్మార్ట్ టివి విభాగంలో విడుదల చేసింది.
Vu Cinema Smart TV ప్రత్యేకతలు
ఈ Vu Cinema Smart TV, 23 జూన్ 2020 న మధ్యాహ్నం 12.00 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ టీవీ రెండు సైజుల్లో లభిస్తుంది – 32 అంగుళాల టీవీ ధర రూ .12,999 మరియు 43 అంగుళాల టీవీని 21,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.