Vu Cinema Smart TV తక్కువ ధర లో అద్భుతమైన ఫీచర్లను తెస్తుంది

Vu Cinema Smart TV  తక్కువ ధర లో అద్భుతమైన ఫీచర్లను తెస్తుంది
HIGHLIGHTS

Vu Cinema Smart TV ని ఉత్తమ 4K ఫీచర్లతో స్మార్ట్ టివి విభాగంలో విడుదల చేసింది.

Dolby Audio సౌండ్ స్పష్టత కోసం మాస్టర్ స్పీకర్ మరియు ట్వీటర్‌తో 40-వాట్ల సౌండ్‌బార్

ప్రీమియం టెలివిజన్ విభాగంలో అగ్రగామి అయిన Vu టెలివిజన్ కొత్తగా  Vu Cinema Smart TV ని ప్రారంభించింది. దీనితో పాటు, ఈ టీవీ సహాయంతో సినిమా అభిమానులు తమ ఇళ్లలో సురక్షితంగా ఉంటూనే ఉత్తమ సినిమా అనుభవాన్ని మరియు ఆడియో-విజువల్ అనుభవాన్ని పొందేలా ఈ కంపెనీ జాగ్రత్త తీసుకుంది. 'బెస్ట్-ఇన్-క్లాస్' స్మార్ట్ టీవీని జూన్ 23, 2020 న ప్రకటించింది మరియు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అమ్మబడుతుంది. టెక్నాలజీ మరియు ఫీచర్ల పరంగా తన వినియోగదారులకు ఉత్తమమైన వాటిని అందించే ఖ్యాతిని కలిగివున్న ఈ కంపెనీ తన Vu Cinema Smart TV ని ఉత్తమ 4K  ఫీచర్లతో స్మార్ట్ టివి విభాగంలో విడుదల చేసింది.

Vu Cinema Smart TV ప్రత్యేకతలు

  • ఈ Vu Cinema Smart TV, IPS  A + గ్రేడ్ ప్యానెల్లు, DolbbyAudioతో 40 వాట్ల సరౌండ్ స్పీకర్లు, మీ వినోదం కోసం ప్రీమియం కంటెంట్ లైబ్రరీ, మరియు ఉత్తమ వీక్షణ అనుభవానికి సున్నితమైన డిజైన్ వంటివి మీ గదిని మరింత అందంగా మారుస్తాయి.
  • అంటే, ఉత్తమ వీక్షణ అనుభవం కోసం అధిక ప్రకాశవంతమైన IPS ప్యానెల్ మీకు హైలైట్ చేసి అద్భుతమైన వివరాలను అందిస్తుంది
  • ఇక Dolby Audio సౌండ్ స్పష్టత కోసం మాస్టర్ స్పీకర్ మరియు ట్వీటర్‌తో 40-వాట్ల సౌండ్‌బార్
  • 100 శాతం రోబోట్ అసెంబ్లీ – అంచులు-తక్కువ డిజైన్, ఇది అన్ని అంచులలో ఖచ్చితమైన ప్రకాశాన్ని మరియు ఏకరీతి బ్రైట్నెస్ నిర్ధారిస్తుంది.
  • ప్రధాన కంటెంట్ యాప్స్ కలిగి ఉన్న Android 9.0 పై తో వాయిస్-అసిస్టెడ్ రిమోట్.

ఈ  Vu Cinema Smart TV,  23 జూన్ 2020 న మధ్యాహ్నం 12.00 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ టీవీ రెండు సైజుల్లో లభిస్తుంది – 32 అంగుళాల టీవీ ధర రూ .12,999 మరియు 43 అంగుళాల టీవీని 21,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo