Smart Tv: రూ.15 వేల ధరలో ఇండియాలోని టాప్-5 బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు

Updated on 13-Jan-2022
HIGHLIGHTS

స్మార్ట్ టీవీలు వాటి స్పెక్స్ షీట్ మరియు ఫీచర్ల పరంగా గొప్పగా ఉంటాయి

32 ఇంచ్ టీవీలు మీ బెడ్ రూమ్ కోసం బాగా అనువైనవి

రూ.15,000 ధరలో ఇండియాలోని టాప్-5 బెస్ట్ స్మార్ట్ టీవీల లిస్ట్

మీ ఇంటికి తగిన స్మార్ట్ టీవీని కోసం కేవలం రూ.15,000 బడ్జెట్ లో మంచి స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? మార్కెట్లో ఉన్న వాటిలో ఏ స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది అని ఆలోచిస్తున్నారా. కంగారు పడకండి, ఎంపికను మరింత సులభం చెయ్యడానికి ఈరోజు రూ.15,000 ధరలో ఇండియాలోని టాప్-5 బెస్ట్ స్మార్ట్ టీవీల లిస్ట్ తీసుకొచ్చాను.

ఇక్కడ లిస్ట్ లో అందించిన స్మార్ట్ టీవీలు వాటి స్పెక్స్ షీట్ మరియు ఫీచర్ల పరంగా గొప్పగా ఉంటాయి. వాస్తవానికి, 32 ఇంచ్ టీవీలు మీ బెడ్ రూమ్ కోసం బాగా అనువైనవి మరియు మీ బడ్జెట్ కు కూడా సరైన ఎంపికగా ఉంటాయి. ఈ టీవీలు HD రెడీ రిజల్యూషన్ తో వస్తాయి మరియు స్మార్ట్ ఫీచర్లను కలిగివుంటాయి. ఈ స్మార్ట్ టీవీలు డబ్బుకు తగిన విలువను అందిస్తాయి.

Mi TV 4A Pro (Buy Here)

ధర: రూ.14,999

Mi TV 4A Pro  HD Ready రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ షియోమి యొక్క సొంత UI ప్యాచ్ వాల్ ఓస్ పైన నడుస్తుంది మరియు Android TV UI ఎంపికను కూడా అందిస్తుంది. ఈ టీవీ DTS-HD తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నలాజిని కూడా కలిగి ఉంటుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఇందులో 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. మీకు నచ్చిన లేదా అవసరమైన Apps డౌన్ లోడ్ చేసుకోవడానికి 8GB ఇంటర్నల్ మెమొరీ కూడా వుంది. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు మరిన్ని యాప్స్ కు మద్దతునిస్తుంది.

Hisense 32A56E (Buy Here)

ధర: రూ.16,999

Hisense 32A56E కూడా HD Ready రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 2 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. మీకు నచ్చిన లేదా అవసరమైన Apps డౌన్ లోడ్ చేసుకోవడానికి 8GB ఇంటర్నల్ మెమొరీ కూడా వుంది. ఈ టీవీ DTS Studio Sound  సౌండ్ టెక్నలాజిని సపోర్ట్ మరియు 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది.ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు మరిన్ని యాప్స్ కు మద్దతునిస్తుంది. ఇది అధికారిక ఆండ్రాయిడ్  9.0PIE OS పైన నడుస్తుంది.

AmazonBasics (Buy Here)

ధర: రూ.15,999

ఇది AmazonBasics Fire TV ఎడిషన్ టీవీ HD రిజల్యూషన్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఇందులో మీ కనెక్టివిటీ అవసరాల కోసం ఈ స్మార్ట్ టీవిలో 2 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ Fire TV OS పైన నడుస్తుంది మరియు Fire TV  Stick ను కనెక్ట్ చెయ్యకుండానే ఇది Fire TV UI ని అందిస్తుంది. అంటే మీరు ఈ టీవీలో అనేక స్ట్రీమింగ్ సర్వీస్ లకు యాక్సెస్ అందుకుంటారు. రిమోట్ కంట్రోల్ తో పాటు ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ మ్యూజిక్ కోసం OTT హాట్‌కీలను కూడా అందిస్తుంది. ఈ టీవీ Alexa ఎనేబుల్ తో వస్తుంది కాబట్టి, ఇతర పరికరాలను కూడా ఈ టీవీతో నియంత్రించవచ్చు.

Thomson 9A Series (Buy Here)

ధర: రూ.12,999

Thomson 9A Series కూడా HD Ready రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. మీకు నచ్చిన లేదా అవసరమైన Apps డౌన్ లోడ్ చేసుకోవడానికి 8GB అంతర్గత మెమొరీతో వస్తుంది. ఈ టీవీ 24W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది మరియు డేడికేటెడ్ OTT హాట్ కీస్ కలిగిన రిమోట్ కంట్రల్ తో ఉంటుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్  UI పైన నడుస్తుంది మరియు Google Play స్టోర్‌కు కూడా యాక్సెస్ పొందుతారు.

Infinix X1 (Buy Here)

ధర: రూ.12,499

 Infinix X1 HD Ready స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ UI పెయిన్ నడుస్తుంది. ఈ HD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నలాజిని కూడా కలిగి ఉంటుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఇందులో 2 HDMI పోర్ట్‌లు మరియు 1 USB పోర్ట్‌లు ఉన్నాయి. మీకు నచ్చిన లేదా అవసరమైన Apps డౌన్ లోడ్ చేసుకోవడానికి 8GB ఇంటర్నల్ మెమొరీ కూడా వుంది. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు మరిన్ని యాప్స్ కు మద్దతునిస్తుంది.

Note: ఆన్లైన్ ధరల కారణంగా  పైన సూచించిన స్మార్ట్ టీవీల ధరలో మార్పులు సంభవించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :