TRAI New Rules: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్.!
ఆన్లైన్ మోసాలు అరికట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది
కొత్త రూల్స్ ను ఇప్పుడు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు వచ్చింది
ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కొత్త యాక్షన్ సహాయం చేస్తుంది
TRAI New Rules: దేశంలో నానాటికి పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు అరికట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 20వ తేదీ ప్రకటించిన కొత్త రూల్స్ ను ఇప్పుడు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు వచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం, అన్ని టెలికాం కంపెనీలు కూడా సక్రమంగా లేని URLs, APKs (ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్) లేదా OTT ( Over The Top) లింక్స్ కలిగిన మెసేజ్ లను బ్లాక్ చేయాలి. మెసేజెస్ నుంచి వచ్చే స్పామ్ లింక్స్ ను అడ్డుకోవడం ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కొత్త యాక్షన్ సహాయం చేస్తుంది.
TRAI New Rules
దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ కు ప్రధాన సాధనం గా భావిస్తున్న స్పామ్ మెసేజ్ లను గుర్తించి దానిని నిలువరించడం ద్వారా ఆన్లైన్ స్కామ్ లకు అడ్డుకట్ట వేసే అవకాశం వుంది. దీనికోసమే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా 2024 ఆగస్టు 20 న ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం, ప్రతీ టెలికాం కంపెనీ కూడా వారి నెట్ వర్క్ సర్వీస్ కోసం జత కూడిన URLs, APKs లేదా OTT లను పరిశీలించి వాటిని వైట్ లిస్ట్ చెయ్యాలి.
ఈ విషయాన్ని తరచుగా చెక్ చేసి ఖచ్చితమైన నివేదిక అందించాలి మరియు కంపెనీలను లిస్ట్ చెయ్యాలి. ఒకవేళ వైట్ లిస్ట్ అవ్వని సోర్స్ నుంచి ఏదైనా URLs లేదా APKs లేదా OTT లింక్స్ కలిగిన మెసేజ్ లు వస్తే వాటిని బ్లాక్ చేయాలి. ఈ కొత్త రూల్ ను అక్టోబర్ 1 నుంచి అమలులోకి తీసుకు వచ్చింది.
ఈ కొత్త విధానం ద్వారా స్కామర్లకు పూర్తిగా చెక్ పెట్టే దిశగా ట్రాయ్ యోచిస్తోంది. ఎక్కువగా స్కాములు జరగడానికి కారణమవుతున్న లింక్స్ కలిగిన మెసేజ్ లను అడ్డుకోవడం ద్వారా స్కామర్లకు చెక్ పెట్టె ప్రయత్నం చేస్తోంది. అయితే, ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అందించే ప్రభుత్వ ప్రధాన సర్వీస్ లు, బ్యాంక్ మరియు మరిన్ని సర్వీసులు అందించే మేసేజెస్ కోసం ఎటువంటి ఆటంకం రాకుండా ఉండడానికి కూడా చర్యలు తీసుకుంది.
Also Read: Smart Watch Deals: చవక ధరలో కొత్త వాచ్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకు వచ్చిన ఈ కొత్త రూల్ తో స్కామర్స్ నుంచి మొబైల్ యూజర్లకు ఊరట లభిస్తుంది.