Toshiba, ఈ జపాన్ ఎలక్ట్రానిక్ కంపెనీ తన 4K స్మార్ట్ టీవీ లను ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ టీవీ లను అత్యధికంగా 4 సంవత్సరాల వారంటీతో విడుదల చేస్తున్నట్లు టీజ్ చేస్తోంది. ఈ టీవీలను 4K రేంజ్ లో విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. అయితే, ముందుగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, వివిధ సైజుల్లో ఈ టీవీలను ప్రకటించే అవకాశం ఉంటుంది.
రేపు విడుదలకానున్న ఈ Toshiba టీవీల గురించి Flipkart ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ని కూడా అందించింది. ఈ పేజ్ ద్వారా అందించిన వివరాల ప్రకారం, ఈ టీవీలను 4K రిజల్యూషన్ మరియు 4 సంవత్సరాల వారంటీ తో ప్రకటించనున్నట్లు చూపిస్తోంది. అలాగే, ఈ టీవీలకు Dolby Vision మరియు Dolby Atmos వంటి ప్రత్యేకతలను కూడా జత చేసినట్లు తెలిపింది.
ఆపరేటింగ్ సిస్టమ్స్ పరంగా, ఈ తోషిబా టీవీలు అంతర్గతంగా అభివృద్ధి చెందిన VIDAA U స్మార్ట్ టీవీ OS యొక్క అప్డేటెడ్ వెర్షన్ లో నడుస్తాయి. ఈ OS ను మొదట Hisense 2014 లో అభివృద్ధి చేసింది. ఎప్పటిలాగే, ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మరియు మరిన్ని వంటి OTT సేవలకు మద్దతు ఇస్తుంది.
అలాగే, మీరు సెప్టెంబర్ 18 మరియు సెప్టెంబర్ 21 మధ్య తోషిబా అల్టిమేట్ 4 కె టివి సిరీస్ ను కొనుగోలు చేస్తే, ఈ ప్యానెల్ పైన నాలుగు సంవత్సరాల వారంటీ పొందవచ్చు. ప్రస్తుతానికి, ఏ మోడల్ ధర ఎంతో అనే విషయం తెలియరాలేదు , తోషిబా అల్టిమేట్ 4 కె సిరీస్ 43 అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల మరియు 65-అంగుళాల మోడళ్లలో వస్తుంది. నాలుగు మోడళ్లు సెప్టెంబర్ 18 న, అంటే రేపు లాంచ్ కానున్నాయి.