తోషిబా తన పోర్ట్ ఫోలియోలో 7 కొత్త టీవీ లను ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టీవీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ మరియు టాటా క్లిక్ లలో లభిస్తాయి. ఈ టీవీలు ధర విసిహానికి వస్తే, 32 అంగుళాల వేరియంట్ కు రూ .12,990 నుంచి హై ఎండ్ 65 అంగుళాల వేరియంట్ రూ .66,990 వరకు ఉంటుంది. ఈ టీవీల యొక్క డిజైన్ జపాన్ లో రూపొందించగా, తయారీ మాత్రం భారతదేశంలో తయారు చేశారు.
Toshiba L5050 టీవీ 32 మరియు 43-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో లభిస్తుంది మరియు దానితో ADS ప్యానెల్ తెస్తుంది. వీటిలో, 32 అంగుళాల టీవీ HD రెడీ టీవీ కాగా, 43 అంగుళాల టివీ మాత్రం FHD టీవీ. చిత్రం యొక్క రంగు పునరుత్పత్తి మరియు స్పష్టతను ఆప్టిమైజ్ చేయడానికి “CEVO ఇంజిన్ ప్రీమియం” ఉందని సంస్థ పేర్కొంది. 43 అంగుళాల టీవీలో 24W సౌండ్ అవుట్ పుట్ ఉండగా, 32 అంగుళాల టీవీలో 20W సౌండ్ అవుట్ పుట్ ఉంది. ఈ రెండు టీవీలు కూడా Dolbny Audio కి మద్దతు ఇస్తున్నాయి. మీ కనెక్టివిటీ అవసరాలకు అనుగుణంగా, ఈ టీవీలు 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లను తీసుకువస్తాయి.
తరువాత, మనకు U5050 సిరీస్ 43, 50 మరియు 55-అంగుళాల టీవీ లతో వస్తుంది. ఈ సిరీస్ టీవీలలో 4K, HDR , Dolby Vision మరియు Dolby Atmos టెక్నాలజీ సపోర్ట్ లభిస్తుంది. ఈ U5050 సిరీస్ "కలర్ రీ-మాస్టర్ టెక్నాలజీతో, ఇది చిత్రం యొక్క నిజమైన, సహజ రంగును పునరుద్ధరిస్తుంది." 43 అంగుళాల టీవీలో 24W సౌండ్ అవుట్ పుట్ ఉండగా, 50 మరియు 55-అంగుళాల 30W సౌండ్ అవుట్ పుట్ ఉంది. మీ కనెక్టివిటీ అవసరాలకు అనుగుణంగా ఈ టీవీలు 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లతో వస్తాయి.
తరువాత, మనకు U7980 సిరీస్ 55 మరియు 65-అంగుళాల స్క్రీన్ సైజులను కలిగి ఉంది. ఈ 4K Dolby Vision మరియు Dolby Atmos లకు మద్దతునిస్తాయి మరియు ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఈ టీవీలు 700 నిట్ల గరిష్ట బ్రైట్నెస్ కలిగి ఉన్నాయి మరియు విస్తృత రంగు స్వరసప్తకానికి మద్దతు ఇస్తాయి. ఈ టీవీలు 24W సౌండ్ అవుట్ పుట్ తీసుకువస్తాయి మరియు మీ కనెక్టివిటీ అవసరాలకు అనుగుణంగా 4 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ ను కలిగి ఉంటాయి.
చాలా స్మార్ట్ టీవీల మాదిరిగా తోషిబా టీవీలు ఆండ్రాయిడ్ OS లో పనిచేయవు. అవి VIDAA OS లో నడుస్తాయి. తోషిబా ప్రకారం, “VIDAA అనేది ఆపరేటింగ్ సిస్టమ్, ఇది టీవీల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు అలాగే ఉత్తమ స్మార్ట్ ఫీచర్ అనుభవం కోసం పూర్తిగా ఆప్టిమైజ్ చేయబడింది. ఇతర మొబైల్ ఆధారిత టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ లతో పోలిస్తే వేగంగా, సరళంగా మరియు అనుకూలీకరించదగినదిగా వుంటుంది ”.
HD ready Toshiba 32L5050 (32 అంగుళాల) ధర రూ .12,990 కాగా, ఫుల్ హెచ్‌డి తోషిబా 43 ఎల్ 5050 (43 అంగుళాల) ధర రూ .22,490.
43 యు 5050 (43 అంగుళాలు) తో ప్రారంభమయ్యే 4K టివి లైనప్ ధర రూ .27,990, 50 యు 5050 (50 అంగుళాల) ధర రూ .32990, తోషిబా 55 యు 5050 (55 అంగుళాల) టివి ధర రూ .36,990.
ఇక టాప్ లైనప్ టీవీల సిరీస్ లో 55U7980 (55-అంగుళాల) మరియు 65U7980 (65-అంగుళాల) టీవీల పైభాగంలో, 700 నిట్స్ బ్రైట్నెస్ టీవీ ధర వరుసగా రూ .46,990 మరియు రూ .66,990.
అన్ని టీవీలు ఈరోజు నుండి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ మరియు టాటా క్లిక్ లలో లభిస్తాయి.