30 వేలకే 55 ఇంచ్ బ్రాండెడ్ 4K HDR స్మార్ట్ టీవీ కావాలా..!!

30 వేలకే 55 ఇంచ్ బ్రాండెడ్ 4K HDR స్మార్ట్ టీవీ కావాలా..!!
HIGHLIGHTS

బెస్ట్ 55 ఇంచ్ 4K HDR స్మార్ట్ టీవీ అఫర్

55 ఇంచ్ బిగ్ 4K Ultra HD స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి డిస్కౌంట్ తో లభిస్తోంది

కేవలం రూ.29,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది

బిగ్ స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్నారా? అయితే, ఈరోజు నేను ఈరోజు అందించిన 55 ఇంచ్ 4K HDR స్మార్ట్ టీవీ అఫర్ ను ఒకసారి పరిశీలించవచ్చు. లేటెస్ట్ వెస్టింగ్ హౌస్ ఇండియాలో విడుదల చేసిన 55 ఇంచ్ బిగ్ 4K Ultra HD స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ బ్రాండెడ్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ 33% భారీ డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ రేటుకే అమెజాన్ నుండి సేల్ అవుతోంది. ఇటీవలే ఇండియాలో విడుదల చెయ్యబడి, బడ్జెట్ ధరకే లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ అఫర్ మరియు స్పెక్స్ వివరాలను ఈ క్రింద చూడవచ్చు.   

వెస్టింగ్ హౌస్ టీవీ అఫర్:

Westinghouse (55 inch) 4K Ultra HD స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 33% డిస్కౌంట్ తో కేవలం రూ.29,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనేవారికి 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని డెబిట్ కార్డ్ EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది ఎంపిక చేసిన బ్యాంక్ యొక్క సెలెక్టెడ్ కస్టమర్లకు మాత్రమే. Buy From Here

WhestingHouse 55 inch tv.jpg  

Westinghouse (55 inch) 4K Ultra HD Smart LED: స్పెక్స్

ఈ వెస్టింగ్ హౌస్ 55 ఇంచ్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది మరియు 500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో  కూడా ఉంటుంది.

సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 40W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ తో వస్తుంది.             

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo