Thomson ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ టీవీ Thomson Alpha ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ పరిమాణంలో HD Ready రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీని అందమైన బెజెలెస్ డిజైన్ మరియు పవర్ ఫుల్ సౌండ్ మరియు స్మార్ట్ ఫీచర్లతో అందించింది. ఈ స్మార్ట్ టీవీ నేచురల్ కలర్స్ ప్రొడ్యూస్ చేయగలదు మరియు మంచి బ్రైట్నెస్ అందించగలదని థాంసన్ చెబుతోంది. థాంసన్ ఆల్ఫా స్మార్ట్ టీవీ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్ వేద్దాం.
Thomson Alpha (32 inch) HD Ready స్మార్ట్ టీవీ 32Alpha007BL మోడల్ నంబర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.9,999 రూపాయలకే థాంసన్ అఫర్ చేస్తోంది. ఈ టీవీ యొక్క ఫస్ట్ సేల్ జూన్ 26 న Flipkart నుండి మొదలవుతుంది. ఈ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ అఫర్ వర్తిస్తుంది.
Thomson Alpha (32 inch) HD Ready స్మార్ట్ టీవీ 1366 x 768 రిజల్యూషన్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫోన్ల మాదిరిగా బెజెల్ లెస్ డిజైన్ ను కలిగి వుంది మరియు 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అంతేకాదు, ఇది 30W సౌండ్ అందించగల స్పీకర్లను సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇక కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
థాంసన్ ఆల్ఫా 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 512GB ర్యామ్ జతగా 4GB స్టోరేజ్ తో వస్తుంది. అయితే, ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మాత్రం కాదు మరియు ఈ స్మార్ట్ టీవీ Linux OS పైన పనిచేస్తుంది.