Exclusive: TCL కొత్త 4K గేమింగ్ స్మార్ట్ టీవీని తెస్తోంది.!
ఇటీవల మినీ LED 4k గూగుల్ టీవీని ఆవిష్కరించిన TCL
TCL కొత్త 4K గేమింగ్ QLED టీవీని లాంచ్ చెయ్యవచ్చు
ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్ ప్రయోజనాన్ని పొందగల 144-VRR ని కూడా అందించవచ్చు.
ఇటీవల మినీ LED 4k గూగుల్ టీవీని ఆవిష్కరించిన TCL, ఇప్పుడు కొత్త 4K గేమింగ్ QLED టీవీని కూడా లాంచ్ చేస్తుందనే ప్రత్యేక సమాచారాన్ని డిజిట్ సంపాదించింది. ఈ ప్రీమియం మోడల్ ని జూన్ 28 న ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు కూడా మా వద్ద సమాచారం వుంది. ఈ అప్ కమింగ్ గురించి మేము కలిగిన సమాచారాన్ని ఈరోజు మీతో పంచుకోనున్నాము.
మా సోర్స్ అందించిన వివరాల ప్రకారం, ఈ కొత్త అప్ కమింగ్ టీవీ కంపెనీ యొక్క క్వాంటమ్ డాట్ డిస్ప్లే టెక్నాలజీతో వైడ్ కలర్ గ్యామూట్ కి సపోర్ట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో HDR 10+ కి సపోర్ట్ కూడా ఉంటుంది మరియు గేమ్‌ల కోసం ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్ ప్రయోజనాన్ని పొందగల 144-VRR ని కూడా అందించవచ్చు. అంతేకాదు, ఈ గేమింగ్ QLED స్మార్ట్ టీవీ రిమోట్ వర్కింగ్ కోసం 'OK Google' మరియు Google Duoని కూడా తీసుకువస్తుందని మా సోర్స్ వెల్లడించింది.
TCL QLED గేమింగ్ స్మార్ట్ టీవీ:
ఇక ఈ అప్ కమింగ్ గేమింగ్ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లకు సంభందించి సమాచారాన్ని గుప్తంగా ఉంచింది. అంతేకాదు, ఈ టీవీ యొక్క ప్యానెల్ పరిమాణం కూడా మిస్టరీగా మిగిలిపోయింది. అయితే, రానున్న రోజుల్లో పూర్తి సమాచారాన్ని మీతో షేర్ చేస్తాము.
కానీ మా అంచనా ప్రకారం, ALLM, Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ లు ఈ టీవీ లో ఆకర్షణీయమైన మరియు ముఖ్యమైన వివరాలుగా మారవచ్చు. భారతదేశంలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ టీవీ మోడల్ ధర 1.6 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉన్నందున, ఈ టీవీల ధర మాత్రం అందరిని అంటుకునే విషయంగా మారుతుంది.