ఈరోజు ఇండియాలో TCL కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వీటిలో TCL C835 మినీ LED 4K స్మార్ట్ టీవీని 4K గేమింగ్ కోసం 144 వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో తీసుకువచ్చింది. అంతేకాదు, ఈ టీవీ గూగుల్ టీవీ సపోర్ట్ మరియు IMAX enhanced వంటి చాలా ప్రత్యేకతలను కలిగి వుంది. ఈ టీవీ తో పాటుగా TCL C635 మరియు TCL P735 టీవీలను కూడా విడుదల చేసింది. వీటిలో, TCL C85 టీవీ హై-ఎండ్ టీవీ కాగా TCL P735 టీవీలు బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటాయి. ఈరోజే విడుదలైన ఈ 4K గేమింగ్ గూగుల్ టీవీ ఎలా ఉందొ చూద్దామా.
TCL C835 మూడు సైజుల్లో లభిస్తుంది మరియు వాటి ధరలు ఈ విధంగా వున్నాయి.
TCL C835 (55) ఇంచ్ గూగుల్ టీవీ ధర : రూ.1,19,990
TCL C835 (65) ఇంచ్ గూగుల్ టీవీ ధర : రూ.1,59,990
TCL C835 (75) ఇంచ్ గూగుల్ టీవీ ధర : రూ.2,29,990
TCL C835 న్యూ జెనరేషన్ మినీ LED 4K గూగుల్ టీవీ ధరకు తగిన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K గేమింగ్ కోసం 144 వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision IQ మరియు IMAX enhanced తో మీ వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ ని పూర్తిగా మార్చేస్తుంది. అంతేకాదు, Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో పాటుగా Onkyo సౌండ్ సిస్టంతో పూర్థిస్థాయి థియేటర్ అనుభవాన్ని ఇంటిలోనే అందిస్తుంది.
ఈ టీవీ గూగుల్ టీవీ సపోర్ట్ తో కూడా వస్తుంది. అలాగే, HDR 10+ సపోర్ట్, MEMC మరియు HDMI 2.1 తో సహా మరిన్ని ఫీచర్లను మీకు అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలతో TCL గొప్ప ఆఫర్లను కూడా జత చేసింది. ఈ టీవీలను ప్రీ బుకింగ్ చేసుకునే వారికి 10,999 విలువైన సౌండ్ బార్ మరియు 2,999 విలువైన వీడియో కాలింగ్ కెమెరా ఉచితంగా లభిస్తాయి. అయితే, ఈ ఆఫర్లు రిలయన్స్ డిజిటల్ మరియు క్రోమా లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.