144-VRR తో 4K గేమింగ్ స్మార్ట్ టీవీని విడుదల చేసిన TCL

144-VRR తో 4K గేమింగ్ స్మార్ట్ టీవీని విడుదల చేసిన TCL
HIGHLIGHTS

ఈరోజు ఇండియాలో TCL కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది

ఈ టీవీ 4K గేమింగ్ కోసం 144 వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది

Dolby Vision IQ మరియు IMAX enhanced తో మీ వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్

ఈరోజు ఇండియాలో TCL కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వీటిలో TCL C835 మినీ LED 4K స్మార్ట్ టీవీని 4K గేమింగ్ కోసం 144 వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో తీసుకువచ్చింది. అంతేకాదు, ఈ టీవీ గూగుల్ టీవీ సపోర్ట్ మరియు IMAX enhanced వంటి చాలా ప్రత్యేకతలను కలిగి వుంది. ఈ టీవీ తో పాటుగా TCL C635 మరియు TCL P735 టీవీలను కూడా విడుదల చేసింది. వీటిలో, TCL C85 టీవీ హై-ఎండ్ టీవీ కాగా TCL P735 టీవీలు బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటాయి. ఈరోజే విడుదలైన ఈ 4K గేమింగ్ గూగుల్ టీవీ ఎలా ఉందొ చూద్దామా.

 TCL C85 : ధర

TCL C835 మూడు సైజుల్లో లభిస్తుంది మరియు వాటి ధరలు ఈ విధంగా వున్నాయి.

TCL C835 (55) ఇంచ్ గూగుల్ టీవీ ధర : రూ.1,19,990

TCL C835 (65) ఇంచ్ గూగుల్ టీవీ ధర : రూ.1,59,990

TCL C835 (75) ఇంచ్ గూగుల్ టీవీ ధర : రూ.2,29,990

TCL C835: స్పెక్స్ మరియు ఫీచర్లు

TCL C835 న్యూ జెనరేషన్ మినీ LED 4K గూగుల్ టీవీ ధరకు తగిన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K గేమింగ్ కోసం 144 వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision IQ మరియు IMAX enhanced తో మీ వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ ని పూర్తిగా మార్చేస్తుంది. అంతేకాదు, Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో పాటుగా Onkyo సౌండ్ సిస్టంతో పూర్థిస్థాయి థియేటర్ అనుభవాన్ని ఇంటిలోనే అందిస్తుంది.

ఈ టీవీ గూగుల్ టీవీ సపోర్ట్ తో కూడా వస్తుంది. అలాగే, HDR 10+ సపోర్ట్, MEMC మరియు HDMI 2.1 తో సహా మరిన్ని ఫీచర్లను మీకు అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలతో TCL గొప్ప ఆఫర్లను కూడా జత చేసింది. ఈ టీవీలను ప్రీ బుకింగ్ చేసుకునే వారికి 10,999 విలువైన సౌండ్ బార్ మరియు 2,999 విలువైన వీడియో కాలింగ్ కెమెరా ఉచితంగా లభిస్తాయి. అయితే, ఈ ఆఫర్లు రిలయన్స్ డిజిటల్ మరియు క్రోమా లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.              

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo