TCL తన iFFALCON బ్రాండ్ క్రింద భారత్ లో మూడు స్మార్ట్ టీవీ లు లాంచ్….

Updated on 27-Apr-2018

చైనా యొక్క టెలివిజన్ తయారీదారు TCL కొత్త iFFALCON TV  బ్రాండ్ ని  ప్రవేశపెట్టింది, ఇది ఇండియా-సెంట్రిక్ స్మార్ట్-టివీ బ్రాండ్ గా  పేర్కొంది. మే నెలలో వినియోగదారులకు ఈ టెలివిజన్ అందుబాటులో ఉంటుంది మరియు ఇది ఇ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు.

TCL మల్టీమీడియా ఓవర్సీస్ బిజినెస్ సెంటర్ జనరల్ మేనేజర్ Harry W u , "మన iFFALCON  బ్రాండ్ ని  ప్రారంభించిన మొదటి దేశం భారతదేశం మరియు ఇ-కామర్స్ చానల్స్ ద్వారా మాత్రమే అమ్ముతుంది, ఈ బ్రాండ్ ఆఫ్లైన్ ఛానళ్లకు తీసుకురాబడదు".

ఈ ఏడాది డిసెంబరు నాటికి iFFALCON టెలివిజన్ యొక్క  2,00,000 యూనిట్లను  సేల్ చేయాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ మార్కెట్లో కేవలం మూడు మోడల్లను ప్రవేశపెట్టింది. ఈ మూడు మోడళ్ల ధర 13,490, 19,990, రూ .45,999, వాటి స్క్రీన్ పరిమాణం 32, 40, 55 అంగుళాలు.

మార్కెట్లో టెలివిజన్ డిమాండ్, ప్రతిస్పందన చూడడం ద్వారా భారతదేశంలో స్థానికంగా దీని తయారీని మేము ప్రారంభించనున్నామని, ఈ సమయంలో చైనా నుండి ఈ యూనిట్లను దిగుమతి చేస్తామని,తెలిపారు , ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా 30% భాగం LG మరియు సోనీ. ఇటీవల, Xiaomi కూడా భారతదేశం లో TVలు  సరసమైన ధరలతో ఆకర్షిస్తున్నాయి . 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :