CES 2021 నుంచి కొత్త Mini-LED TV లను ప్రకటించిన TCL

Updated on 12-Jan-2021
HIGHLIGHTS

Mini-LED TV లను ప్రకటించిన TCL

TCL Mini-LED టీవీలు Google TV UI కి సపోర్ట్ చేస్తాయి.

TCL కొత్తగా తన 4K Mini-LED TV C825, TCL 4K QLED TV C725, TCL 4K HDR TV P725 టీవీలను ప్రకటించింది.

TCL సంస్థ ఇప్పటికే అంతర్జాతీయంగా ఆకట్టుకునే టీవీలను కలిగివుంది. ఇప్పుడు US లో జరుగుతున్న అతిపెద్ద కార్యక్రమం CES 2021 నుండి Mini-LED TV లను ప్రకటించి మరొక కొత్త మైలురాయిని కూడా చేరుకుంది.  ఈ సంవత్సరం మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధం చేస్తున్న కొన్ని కొత్త టీవీలను CES 2021 లో ప్రదర్శించింది. అంతేకాదు, ఈ టీవీలు అన్ని కూడా కొత్తగా ప్రకటించిన Google TV UI కి సపోర్ట్ చేస్తాయి.

ఈ CES 2021 నుండి TCL కొత్తగా తన 4K Mini-LED TV C825, TCL 4K QLED TV C725, TCL 4K HDR TV P725 టీవీలను ప్రకటించింది.

TCL K Mini-LED TV C825

ఈ టీవీ TCL యొక్క సెకండ్ జెనరేషన్ మినీ LED టీవీ అవుతుంది. అంతేకాదు, ఈ టీవీ యొక్క పనితీరు కూడా చూడడానికి చాలా ఆసక్తికరంగా వుంటుంది. అదేమిటంటే, ఈ టీవీలను ప్రకటించే సమయంలో ఈ టీవీని గురించి TCL చెబుతూ " C825 టీవీలు సాంప్రదాయ  LED యొక్క లైట్ పరిమాణాన్ని 100 ~200 μm కి తగ్గించి నేరుగా బ్యాక్ లైట్ మోడ్ ను స్వీకరిస్తుంది. అర్ధమయ్యేలా ఒక్కమాటలో చెప్పాలంటే, ఎక్కువ LED లైట్స్ తో బ్యాక్ లైట్ సోర్స్ మరియు పూర్తి-శ్రేణి డిమ్మింగ్ కు శక్తినిస్తుంది. దీని ప్రభావముతో, ఎక్కువ బ్రైట్నెస్ మరియు కాంట్రాస్ట్ ను ఈ టీవీలతో పొందవచ్చు. TCL K Mini-LED TV C825 క్వాంటం డాట్ టెక్నాలజీ కలిగి ఉంటుంది కాబట్టి ఈ టీవీ కలర్ మరియు పిక్చెర్ క్వాలిటీని పెంచడంలో సహాయపడుతుంది.

అంతేకాదు, C825 Dolby Vision మరియు HDR కి కూడా సపోర్ట్ చెయ్యడంతో పాటుగా Dolby Vision IQ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ HDMI 2.1 కి సపోర్ట్ చేస్తుంది, ఇది టీవీ VRR(వేరియబుల్ రిఫ్రెష్ రేట్) ALLM (ఆటో లో లెటెన్సీ మోడ్) మరియు 120Hz వద్ద 4K కి సపోర్ట్ చేస్తుంది. అలాగే, 4MP మ్యాగ్నెటిక్ స్ప్లిట్ టైప్ కెమెరాను టీవీ పైన కలిగి ఉన్నందున మీ వీడియో కాన్ఫరెన్సులకు కూడా ఈ టీవీ ను నేరుగా ఉపయోగించుకోవచ్చు.                   

TCL 4K QLED TV C725

TCL C725 టీవీ QLED TV ఇది ఇది దాదాపుగా 100% అల్ట్రా-హై కలర్ గ్యాముట్ (DCI-P3) తో, C725 లోని క్వంటం డాట్ డిస్ప్లే టెక్నాలజీ ఎక్కువ శక్తివంతమైన మరియు విభిన్న రంగులను అందిస్తుంది. HDR 10, Dolby Vision మరియు Dolby Atmos తో Onkyo ట్యూన్ చేసిన ఆడియో సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీలో హ్యాండ్స్ ఫ్రీ సపోర్ట్ కూడా అందుతుంది మరియు అన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసుల నుండి కంటెంట్ అందించడంతో పాటుగా HDMI 2.1 సపోర్ట్ తో వస్తుంది.    

TCL 4K HDR TV P725

ఇక చివరి మోడల్ TCL 4K HDR TV P725 విషయానికి వస్తే, ఈ టీవీలలో QLED బ్యాక్ లైటింగ్ లేదు కానీ ఇది DolbyVision మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన 4K టీవీ మరియు ఇది Google Assistant తో వస్తుంది. ఇది అన్ని ప్రముఖ స్ట్ర్రేమింగ్ సర్వీసులకు మద్దతునిస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :