బడ్జెట్ ధరలో లభిస్తున్న QLED TV ల పైన ఒక లుక్కేద్దామా. మార్కెట్ లో రక రకాల స్మార్ట్ LED టీవీ లభిస్తున్న విషయం తెలిసిందే. అందులో, LCD, LED, QLED మరియు OLED టీవీలు ఉన్నాయి. అయితే, వీటిలో LED తక్కువ ధరలో మినిమం ఫీచర్లతో వస్తుండగా, OLED లు చాలా హై ఎండ్ క్వాలిటీ ఫీచర్లతో అధిక ధర లో లభిస్తాయి. కానీ, QLED స్మార్ట్వ్ టీవీ లు మాత్రం మిడ్ రేంజ్ బడ్జెట్ లో తగిన ఫీచర్లు మంచి క్వాలిటీ విజువల్స్ ను అందించ గలవు. అయితే, బడ్జెట్ ను పరిగణలోకి తీసుకునే వారికి కొన్ని టీవీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందుకే, 40 వేల బడ్జెట్ లో లభిస్తున్న బిగ్ QLED TV ల గురించి ఈరోజు తెలుసుకుందాం.
అఫర్ ధర : 32,990
TCL బ్రాండ్ నుండి వచ్చిన ఈ బడ్జెట్ QLED TV రూ. 32,990 రూపాయలకు లభిస్తుంది. ఈ టీవీ Dolby Vision సపోర్ట్ తో మంచి పిక్చర్ క్వాలిటీని అందించ గలదు మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ ని కూడా కలిగి వుంది. 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ 24W సౌండ్ అందించ గల స్పీకర్లను కలిగి వుంది. ఈ టీవీ లో అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి.
అఫర్ ధర : 32,990
ఈ కోడాక్ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో 50 ఇంచ్ హెవీ సైజులో లభించే బెస్ట్ QLED TV టీవీ గా నిలుస్తుంది. ఈ కోడాక్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+, HLG మరియు AMO టెక్నాలజీ సపోర్ట్ తో మంచి రిచ్ కలర్ లను Dolby Atmos, Dolby Digital మరియు DTS సపోర్ట్ కలిగి 40W హెవీ సౌండ్ తో మంచి ఆడియో ని కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కోడాక్ టీవీ కూడా అన్ని కనక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
అఫర్ ధర : 32,990
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ కూడా అతి తక్కువ ధరలో 50 ఇంచ్ సైజులో లభించే బెస్ట్ QLED TV టీవీ గా నిలుస్తుంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+, HLG సపోర్ట్ లతో గొప్ప పిక్చర్ క్వాలిటీని అందించ గలదని థాంసన్ తెలిపింది. అంతేకాదు, ఈ టీవీ Dolby Atmos, Dolby Digital, Dolby Audio మరియు DTS సపోర్ట్ తో 40W సౌండ్ ను అందించ గలదు. ఈ టీవీ లో కూడా మల్టి కనెక్టివిటీ సపోర్ట్ వుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చే గూగుల్ టీవీ ఇది.
ఇన్ఫినిక్స్ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో 55 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో వచ్చే QLED TV గా నిలుస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+ మరియు MEMC టెక్నలాజితో మంచి విజువల్స్ ను అందించ గలదు మరియు 36W సౌండ్ అందించ గల స్పీకర్లు మరియు Dolby Atmos సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందించగలదని కూడా కంపెనీ చెబుతోంది. ఈ ఇన్ఫినిక్స్ QLED TV కూడా అన్ని కనెక్టివిటీ అప్షన్ లను కలిగి ఉంటుంది.
అఫర్ ధర : 35,999
మోటోరోలా ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన ఈ లేటెస్ట్ QLED TV మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ క్వాంటమ్ గ్లో టెక్నాలజీ మరియు Dolby Vision సపోర్ట్ గొప్ప క్వాలిటీ తో పిక్చర్ ను Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ సౌండ్ ను అందించ గల సత్తా ని కలిగి ఉందని మోటోరోలా తెలిపింది. ఈ టీవీ వేగవంతమైన Wi-Fi కనెక్టివిటీ తో పాటుగా మల్టి కనక్టిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.