Sony Bravia 9 Series స్మార్ట్ టీవీలను భారీ ఫీచర్స్ తో విడుదల చేసిన సోనీ.!

Updated on 20-Aug-2024
HIGHLIGHTS

సోని ఈరోజు ఇండియాలో కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది

సోనీ బ్రావియా 9 సిరీస్ నుంచి కొత్త Mini LED (QLED) స్మార్ట్ టీవీలు విడుదల చేసింది

Dolby Vision మరియు Dolby Atmos వంటి మరిన్ని ఫీచర్స్ తో విడుదల చేసింది

Sony Bravia 9 Series: సోని ఈరోజు ఇండియాలో కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. సోనీ బ్రావియా 9 సిరీస్ నుంచి సోనీ ఈ కొత్త Mini LED (QLED) స్మార్ట్ టీవీలు విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలను Dolby Vision మరియు Dolby Atmos వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ కొత్త టీవీ స్పెక్స్ మరియు ఫీచర్లు చాలా ఆకట్టుకుంటున్నాయి.

Sony Bravia 9 Series : ఫీచర్స్

సోనీ బ్రావియా 9 మినీ ఎల్ఈడి సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది. ఇందులో 75 ఇంచ్ స్మార్ట్ టీవీ K-75XR90 మోడల్ నెంబర్ తో 85 ఇంచ్ స్మార్ట్ టీవీ K-85XR90 మోడల్ నెంబర్ లతో విడుదల చేసింది. ఈ రెండు టీవీలు కూడా చాలా నాజూకైన అంచులతో పూర్తిగా స్క్రీన్ కనిపించేలా ఉన్నాయి.

ఈ కొత్త బ్రావియా 9 మినీ ఎల్ఈడి సిరీస్ స్మార్ట్ టీవీలు గరిష్ట బ్రైట్నెస్ అందించే QLED బ్యాక్ లైట్ తో వస్తాయి మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటాయి. ఈ స్క్రీన్ XR Triluminos Pro మరియు లైవ్ కలర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లు XR ప్రోసెసర్ తో వస్తాయి మరియు Dolby Vision తో పాటు HDR 10 మరియు HLG సపోర్ట్ లతో గొప్ప విజువల్స్ అందిస్తాయి.

ఈ కొత్త సోనీ టీవీ లు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఈథర్నెట్, బ్లూటూత్ v5.3, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, 4 HDMI, డిజిటల్ ఆడియో అవుట్ పుట్ మరియు 2 USB పోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఆడియో పరంగా కూడా గొప్ప ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ సోనీ స్మార్ట్ టీవీ రెండు 10W మిడ్ రేంజ్ స్పీకర్లు, రెండు 10W సబ్ ఉఫర్, రెండు 10W ట్వీటర్లు మరియు రెండు 5W భీమ్ ట్వీటర్ లను కలిగి ఉంటుంది. అంటే, ఈ టీవీలో కంప్లీట్ స్పీకర్ సెటప్ వుంది మరియు Dolby Atmos, డాల్బీ ఆడియో తో పాటు DTS: X, dts డిజిటల్ సరౌండ్, dts ఎక్స్ ప్రెస్ వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఇది మాత్రమే కాదు, AAC (అకౌస్టిక్ ఆటో కాలిబ్రేషన్) తో రూమ్ మరియు యూజర్ పొజిషన్ ను బట్టి సౌండ్ ను ఫోకస్ చేసి అందిస్తుంది. అంతేకాదు, వాయిస్ జూమ్ 3 మరియు 3D సరౌండ్ అప్ స్కేలింగ్ వంటి మరిన్ని ఫీచర్స్ ను కలిగి ఉంటాయి ఈ టీవీలు.

Also Read: iQOO Z9s series: రేపు లాంచ్ కాబోతున్న ఐకూ కొత్త ఫోన్లు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

Sony Bravia 9 Series : ధర

సోనీ 75 ఇంచ్ (K-75XR90) టీవీ ధర : రూ. 4,49,990

సోనీ 85 ఇంచ్ (K-85XR90) టీవీ ధర : రూ. 5,99,990

ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా సోనీ సెంటర్, అధీకృత టీవీ షో రూమ్స్, ఆన్లైన్ రిటైలర్ ప్లాట్ ఫామ్స్ నుండి లభిస్తాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :