Sony BRAVIA 9: అత్యంత ప్రకాశవంతమైన 4K Smart Tv సిరీస్ లాంచ్ చేసిన సోనీ.!

Sony BRAVIA 9: అత్యంత ప్రకాశవంతమైన 4K Smart Tv సిరీస్ లాంచ్ చేసిన సోనీ.!
HIGHLIGHTS

Sony BRAVIA 9 టీవీలను చాలా గొప్ప ఫీచర్స్ తో విడుదల చేసింది

సోనీ బ్రావియా 9 అత్యంత ప్రకాశవంతమైన 4K Smart Tv సిరీస్ గా వచ్చింది

ఈ టీవీలు సరికొత్త టెక్నాలజి కలిగిన AI Processor XR ప్రోసెసర్ తో పని చేస్తాయి

Sony BRAVIA 9: సోనీ ఈరోజు మార్కెట్లో అత్యంత ప్రకాశవంతమైన 4K Smart Tv సిరీస్ లాంచ్ చేసింది. అదే, సోనీ బ్రావియా 9 సిరీస్ మరియు ఈ స్మార్ట్ టీవీలను చాలా గొప్ప ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ కొత్త టీవీల గురించి “Cinema is Coming Home” అనే ఒక్క మాటతో సింపుల్ గా తేల్చి చెప్పింది. సినిమా హల్ ను తలదన్నే విధంగా ఈ స్మార్ట్ టీవీ ఉంటుందని సోనీ చెప్పకనే చెబుతోంది. మార్కెట్ లో సోనీ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ సిరీస్ ఫీచర్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Sony BRAVIA 9: ఫీచర్స్

సోనీ ఇండియా ఈ సోనీ బ్రావియా 9 Mini LED సిరీస్ ను ప్రీమియం ఫీచర్స్ తో అందించింది. ఆఫ్ కోర్స్, ఈ స్మార్ట్ ఫోన్ ధర కూడా అలాగే ఉంటుంది అనుకోండి. ముందుగా ఈ టీవీ ఫీచర్స్ లోకి వెళితే, ఈ టీవీ సిరీస్ ను 189 cm (75 ఇంచ్) మరియు 215 cm (85 ఇంచ్) సైజ్ లో విడుదల చేసింది. ఈ టీవీలు సరికొత్త టెక్నాలజి కలిగిన AI Processor XR ప్రోసెసర్ తో పని చేస్తాయి. ఈ ప్రోసెసర్, సీన్ ను బట్టి సినిమా క్రియేటర్స్ ఊహకు అనుగుణంగా తగిన సర్దుబాటు చేసిన పిక్చర్ ను అత్యంత గరిష్ఠమైన బ్రైట్నెస్ తో ఈ టీవీలలో అందిస్తుంది. అంతేకాదు, కంటెంట్ చూసే వారికి అనుగుణంగా సౌండ్ ను సర్దుబాటు చేసి లీనమయ్యే సౌండ్ ను అందిస్తుంది.

Sony BRAVIA 9 4K Smart Tv

ఈ స్మార్ట్ టీవీ LCD డిస్ప్లే ని Mini LED (QLED) బ్యాక్ లైట్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 3840 x 2160 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు లోకల్ డిమ్మింగ్ తో వస్తుంది. గొప్ప విజువల్స్ అందించాడని వీలుగా ఈ టీవీలో XR బ్యాక్ లైట్ మాస్టర్ డ్రైవ్ మరియు XR కాంట్రాస్ట్ బూస్టర్ ఫీచర్ వుంది. ఈ టీవీ HDR 10, HLG మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది మరియు IMAX ఎన్ హెన్స్ ఫీచర్ తో సినిమా హల్ ని తలదన్నే అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ లో మొత్తం 8 స్పీకర్లు ఉన్నాయి. ఇందులో 2 సబ్ ఉఫర్, 2 మిడ్ రేంజ్, 2 బీమ్ ట్వీటర్ మరియు 2 ట్వీటర్ స్పీకర్ లను కలిగి ఉంటుంది. ఈ సూపర్ స్పీకర్ సెటప్ తో పాటు బెస్ట్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి వుంది. అవేమిటంటే, ఈ టీవీ Dolby Atmos, Dolby Audio, Dts డిజిటల్ సరౌండ్, DTS ఎక్స్ ప్రెస్, DTS-HD మాస్టర్, DTS:X వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి వుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ 3D అప్ స్కేల్ ఫీచర్ తో కూడా వస్తుంది.

కనెక్టివిటీ పరంగా, HDMI, VRR, ALLM, Digital Audio Out బ్లూటూత్ 5.3, USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని సపోర్ట్ లను కలిగి వుంది.

Also Read: BSNL Limited Period Offer: రూ. 599 ప్లాన్ తో అదనపు లాభాలు ప్రకటించింది.!

Sony BRAVIA 9: ప్రైస్

సోనీ బ్రావియా 9 సిరీస్ స్మార్ట్ టీవీలు చాలా ప్రీమియం ధరలో వచ్చాయి. వీటిలో 75 ఇంచ్ (75XR90) టీవీ ధర రూ. 4,49,990 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. 85 ఇంచ్ (85XR90) టీవీని రూ. 5,99,990 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీలు ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo