ఇండియాలో Sony Bravia 7 Mini LED లాంచ్ చేసిన సోనీ.. రేటు ఎంతంటే.!

Updated on 02-Jul-2024
HIGHLIGHTS

Sony Bravia 7 Mini LED సిరీస్ నుంచి కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది

ఈ సిరీస్ నుంచి మూడు సైజుల్లో కొత్త స్మార్ట్ టీవీలు లాంచ్ చేసింది

ఈ టీవీ BRAVIA Cam మరియు కెమెరా యాప్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది

ఇండియాలో Sony Bravia 7 Mini LED సిరీస్ నుంచి కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి మూడు సైజుల్లో కొత్త స్మార్ట్ టీవీలు లాంచ్ చేసింది. ఈ కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ లను పవర్ ఫుల్ సౌండ్ అందించే స్పీకర్లు మరియు ఆల్ ఫార్మాట్ కంపేటబుల్ స్టన్నింగ్ స్క్రీన్ తో తీసుకు వచ్చింది. సోనీ సరికొత్తగా అందించిన ఈ కొత్త స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

Sony Bravia 7 Mini LED: ఫీచర్లు

ఈ కొత్త సోనీ స్మార్ట్ టీవీలు 55 ఇంచ్, 65 ఇంచ్ మరియు 75 ఇంచ్ స్క్రీన్ సైజులో విడుదల చేసింది. అయితే, ఈ మూడు స్మార్ట్ టీవీ లు కూడా ఒకే ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ టీవీ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు లోకల్ డిమ్మింగ్ క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10, HLG మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది మరియు అద్భుతమైన విజువల్స్ ను అందిస్తుందని సోనీ తెలిపింది. XR మోషన్ క్లారిటీ, XR క్లియర్ ఇమేజ్ మరియు XR పిక్చర్ ప్రోసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Sony Bravia 7 Mini LED

ఈ సోనీ మినీ LED స్మార్ట్ టీవీ రెండు బాస్ రిఫ్లెక్స్ ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు రెండు ట్వీటర్ లు కలిగిన ఫుల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ కు తోడు ఇందులో Dolby Atmos, DTS:X, DTS-HD వంటి చాలా సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ BRAVIA Cam మరియు కెమెరా యాప్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.

కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవీ బ్లూటూత్ 5.3 సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDPC, HDMI eArc/Arc మరియు USB పోర్ట్ లతో పాటుగా రెగ్యులర్ పోర్ట్ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.

Also Read: Jio రూ. 1559 వన్ ఇయర్ ప్లాన్ రీఛార్జ్ కోసం ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఈరోజే ఆఖరి అవకాశం.!

Sony Bravia 7 Mini LED: ధర

ఈ స్మార్ట్ టీవీ ధరలు టీవీ సైజు వారిగా ఈ ఇక్కడ చూడవచ్చు

సోనీ బ్రావియా 7 మినీ ఎల్ఈడి (55 ఇంచ్) ధర : రూ. 1,82,990

సోనీ బ్రావియా 7 మినీ ఎల్ఈడి (65 ఇంచ్) ధర : రూ. 2,29,990

సోనీ బ్రావియా 7 మినీ ఎల్ఈడి (55 ఇంచ్) ధర : (ఇంకా ప్రకటించలేదు) త్వరలో ప్రకటిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :