Sony Bravia 3 సిరీస్ స్మార్ట్ టీవీ లను భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసిన సోనీ.!
సోనీ కొత్త స్మార్ట్ టీవీలను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
Sony Bravia 3 సిరీస్ నుండి ఈ స్మార్ట్ టీవీలను విడుదల చేసింది
ఈ కొత్త సోనీ స్మార్ట్ టీవీలు సౌండ్ పరంగా కూడా మంచి అప్గ్రేడ్ కలిగి ఉన్నాయి
ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కొత్త స్మార్ట్ టీవీలను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. Sony Bravia 3 సిరీస్ నుండి ఈ స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ సోనీ బ్రావియా కొత్త సిరీస్ నుంచి 43 ఇంచ్ సైజు మొదలుకొని 85 ఇంచ్ వరకూ అన్ని సైజుల్లో స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. అయితే, ప్రస్తుతానికి రెండు స్మార్ట్ టీవీల ధరలు మాత్రమే ప్రకటించింది. కానీ ఈ స్మార్ట్ టీవీలను Triluminos PRO మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే బాస్ రిఫ్లెక్ట్ స్పీకర్లు వంటి చాలా ప్రత్యేకతలతో అందించింది.
Sony Bravia 3 : ప్రైస్
సోనీ బ్రావియా 3 సిరీస్ నుంచి 55 ఇంచ్ మరియు 65 ఇంచ్ రెండు స్మార్ట్ టీవీల ధరలు మాత్రమే ప్రకటించింది. ఇందులో 55 ఇంచ్ స్మార్ట్ టీవీని K-55S30 మోడల్ నెంబర్ తో రూ. 93,990 రూపాయల ధరలో లాంచ్ చేసింది. అలాగే, 55 ఇంచ్ టీవీని K-65S30 మోడల్ నెంబర్ తో రూ. 1,21,990 ధరతో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ టీవీలు సోనీ సెంటర్, ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్స్ మరియు ఇ కామర్స్ ప్లాట్ ఫామ్స్ నుండి సేల్ అవుతాయి.
Also Read: WhatsApp : యూజర్ ప్రైవసీ మరింత పటిష్టం చేయడానికి కొత్త Privacy Checkup ఫీచర్ తెస్తోంది.!
Sony Bravia 3 : ఫీచర్లు
సోనీ ఈ స్మార్ట్ టీవీలను భారీ ఫీచర్లతో అందించింది. బ్రావియా 3 స్మార్ట్ టీవీలు Dolby Vision, Triluminos PRO మరియు 4K HDR Processor X1 సపోర్ట్ అత్యద్భుతమైన విజువల్స్ ను అందిస్తాయని సోని తెలిపింది. అంతేకాదు, ఈ టీవీ లలో 4K X-Reality PRO, మోషన్ ఫ్లో XR 100, HDR 10/HLG సపోర్ట్ లు కూడా ఉన్నాయి.
ఈ కొత్త సోనీ స్మార్ట్ టీవీలు సౌండ్ పరంగా కూడా మంచి అప్గ్రేడ్ కలిగి ఉన్నాయి. ఈ టీవీలలో 2 బాస్ రిఫ్లెక్ట్ ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు 2 సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ టీవీ టోటల్ 20W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Audio మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి వుంది మరియు యాంబియంట్ ఆప్టిమైజేషన్ ఫీచర్ ను కూడా కలిగి వుంది.
కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ లలో బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, బిల్ట్ ఇన్ మైక్, 4 HDMI (eARC) (HDMI 2.1), 2 USB మరియు Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.