CES 2021 నుండి కొత్త ప్రొసెసర్ తో 4K మరియు 8K టీవీలను ఆవిష్కరించిన Sony

CES 2021 నుండి కొత్త ప్రొసెసర్ తో 4K మరియు 8K టీవీలను ఆవిష్కరించిన Sony
HIGHLIGHTS

Sony తన Bravia టీవీ లైనప్ నుండి కొత్త టీవీలను అనౌన్స్ చేసిం

ఈ కొత్త టీవీ లైనప్ లో 4K మరియు 8K టీవీలు కూడా వున్నాయి

ఈ సోనీ టీవీలు Google TV UI తో మరియు HDMI 2.1 సపోర్ట్ తో వస్తాయి.

CES 2021 కార్యక్రమంలో Sony తన Bravia టీవీ లైనప్ నుండి కొత్త టీవీలను అనౌన్స్ చేసింది. ఈ కొత్త టీవీ లైనప్ లో 4K మరియు 8K టీవీలు కూడా వున్నాయి. అయితే, ఈ కొత్త Bravia టీవీ లైనప్ లో కొన్ని టీవీలు LED టీవీలు కాగా మరికొన్ని OLED టీవీలు ఉన్నాయి. అయితే, కొత్తగా ప్రకటించిన ఈ సోనీ టీవీలు Google TV UI తో మరియు HDMI 2.1 సపోర్ట్ తో వస్తాయి.

CES 2021 నుండి ప్రకటించిన Sony Bravia టీవీ లైనప్ లో మాస్టర్ సిరీస్ Z9J 8K LED, మాస్టర్ సిరీస్ A90J మరియు A80J OLED మరియు X95J మరియు X90J 4K LED వంటి మోడళ్ళు వున్నాయి. వీటిలో ఏయే టీవీలు ఎటువంటి సైజులలో ఉంటాయో ఈ క్రింద చూడవచ్చు.

1. మాస్టర్ సిరీస్ Z9J 8K LED : ఈ టీవీలు 85 మరియు 75 ఇంచ్ సైజుల్లో లభిస్తుంది.   

2. మాస్టర్ సిరీస్ A90J 4K OLED : ఈ టీవీలు 83,65 మరియు 55 ఇంచ్ సైజుల్లో లభిస్తుంది.  

3. A80J 4K OLED :  ఈ టీవీలు 77,65 మరియు 55 ఇంచ్ సైజుల్లో లభిస్తుంది.  

4. X95J 4K LED :  ఈ టీవీలు 85,75 మరియు 65 ఇంచ్ సైజుల్లో లభిస్తుంది.     

5. X92J 4K LED :  ఈ టీవీ 100 అంగుళాల పరిణామంలో లభిస్తుంది.    

6. X90J 4K LED :  ఈ టీవీలు 75,65,55 మరియు 60 ఇంచ్ సైజుల్లో లభిస్తుంది.     

కాగ్నిటివ్ ప్రొసెసర్ XR

ఇప్పటి వరకూ సోని టీవీలను నడిపించిన X1 అల్టిమేట్ చిప్సెట్ స్థానంలో కొత్త చిప్ సెట్ Sony XR లేదా మరింత స్పష్టంగా చెప్పాలంటే కాగ్నిటివ్ ప్రొసెసర్ XR ను ప్రవేశపెట్టింది. మనుషులు చూసే మరియు వినే  మార్గాలను పూర్తిగా ప్రతిబింభించేలా రూపొందించబడిన కొత్త ప్రొసెసింగ్ పద్దతిని ఇది ఉపయోగిస్తుందని, ఈ చిప్ సెట్ గురించి సోని తెలిపింది.

విషయాన్ని వివరంగా చెప్పాలంటే, సోని యొక్క ఈ టీవీలు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి పూర్తి స్క్రీన్ పైన ద్రుష్టి పెట్టడం సాధ్యపడదు. అందుకే, స్క్రీన్ పైన సమయాన్ని బట్టి అవసరమైన నిర్దిష్ట భాగం లేదా నిర్దిష్టమైన ప్రాంతం అత్యంత స్పష్టమైన వివరాలను కలిగి ఉండేలా చూస్తుంది.               

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo