Rs.10,999 ధరకే ఇంటెలిజెంట్ స్మార్ట్ LED TVని విడుదల చేసిన Skiodo

Updated on 22-May-2019
HIGHLIGHTS

Skiodo కేవలం Rs.10,999 ధరకే 32 అంగుళాల ఇంటెలిజెంట్ స్మార్ట్ LED TVని విడుదల చేసింది.

ఈ స్మార్ట్ LED టీవీ ని 'NB32INT01' అనే మోడల్ నంబరుతో లాంచ్ చేసింది.

హోమ్ అప్లయన్సెస్ విభాగంలో మంచి పేరు కలిగిన Skiodo కేవలం Rs.10,999 ధరకే 32 అంగుళాల ఇంటెలిజెంట్ స్మార్ట్ LED TVని విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ ని Flipkart యొక్క భాగస్వామ్యంతో విడుదల చేయగా, ఇది Flipkart యొక్క ఆన్లైన్ ప్లాట్ఫారం మరియు అన్ని ప్రముఖ రిటైల్ రెటైల్స్ స్టోర్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ LED టీవీ ని 'NB32INT01' అనే మోడల్ నంబరుతో లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్ LED టీవీ ఒక 1366 X 768 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక HD Ready టీవీ గా అందించింది మరియు దీన్ని 200000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో గల ఒక A+ గ్రేడ్ ప్యానల్ తో అందించింది కాబట్టి, సూపర్ క్లారిటీ మరియు కలర్స్ చాల బ్రైట్ గా కనిపిస్తాయి. అంతేకాదు, ఇది Cortex A53 ప్రాసెసర్ జతగా 1GB ర్యామ్ మరియు 8GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. దీని కారణంగా, మీకు మంచి స్మార్ట్ టీవీ అనుభూతి కలుగుతుంది.

అలాగే, ఇందులో అంతర్గతంగా అందించిన Miracast సపోర్టుతో మీ అన్ని ఫోన్లతో చాల సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. అధనంగా, ఈ స్మార్ట్ టీవీ కొన్ని ఇన్ బిల్ట్ ఆప్స్ తో వస్తుంది కాబట్టి వాటితో నిరంతరంగా హోమ్ ఎంటర్టైన్మెంట్ అందుకోవచ్చు. ఇక ఇందులో, 3HDMI పోర్టులు, 2USB పోర్టులు Wi-fi మరియు LAN పోర్టులను కూడ అందించింది. చివరిగా, ఇందులోని సౌండ్ విషయానికి వస్తే, ఇందులో అందించిన 20W స్పీకర్ల వలన గొప్ప సౌండ్ మీరు అందుకుంటారు

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :