ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టకుండా కేవలం 8,000 రూపాయల బడ్జెట్ లో పెద్ద 32 ఇంచ్ LED టీవీ కోసం చూస్తున్నారా? అయితే, Blaupunkt ఇటీవల విడుదల చేసిన కొత్త ఫ్యామిలీ సిరీస్ LED టీవీ గురించి తెలుసుకోవాల్సిందే. బ్లూపంక్ట్ BLA32AH410 మోడల్ నంబర్ తో ప్రకటించిన ఫ్యామిలీ సిరీస్ LED టీవీ FLIPKART నుండి కేవలం రూ.7,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే, తక్కువ ధరకే అమ్ముడవుతున్న ఈ 32 అంగుళాల LED టీవీ గురించి తెలుసుకుందామా.
ప్రముఖ జర్మనీ ఎలక్ట్రానిక్స్ సంస్థ బ్లూపంక్ట్, BLA32AH410 మోడల్ నంబర్ తో ప్రకటించిన ఫ్యామిలీ సిరీస్ LED టీవీ FLIPKART నుండి 55% డిస్కౌంట్ తో కేవలం రూ.7,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తుంది. ఈ టీవీ మీ CPU కి కూడా కనెక్ట్ చేసుకునే విధంగా VGA పోర్టుతో కూడా వుంటుంది. ఇంత తక్కువ ధరలో ఇటువంటి ఫీచర్లతో వచ్చే బ్రాండెడ్ LED టీవీ ఇదే కావచ్చు.
మీ వద్ద కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు ఉంటే, కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు EMI ప్లాన్ తో నెలకు కేవలం రూ. 1401 రూపాయల చెల్లింపుతో ఈ టీవీని కొనుగోలు చెయ్యవచ్చు. ఇక ఈ టీవీ యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 2HMDI, 2USB మరియు 1VGA పోర్టుతో వస్తుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందించ గలదు.