శామ్సంగ్ క్రిస్టల్ సిరీస్ నుండి మరొక కొత్త స్మార్ట్ టీవీ లాంచ్.!

శామ్సంగ్ క్రిస్టల్ సిరీస్ నుండి మరొక కొత్త స్మార్ట్ టీవీ లాంచ్.!
HIGHLIGHTS

శామ్సంగ్ తన క్రిస్టల్ సిరీస్ నుండి మరొక కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ టీవీ వన్ బిలియన్ ట్రూ కలర్స్, Crystal 4K ప్రాసెసర్‌ సపోర్ట్ తో

ఈ లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ టీవీ మిడ్ రేంజ్ ధరలో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది

శామ్సంగ్ తన క్రిస్టల్ సిరీస్ నుండి మరొక కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. అదే, Samsung Crystal 4K Neo TV మరియు ఈ స్మార్ట్ టీవీ వన్ బిలియన్ ట్రూ కలర్స్ అందించడమే కాకుండా Crystal 4K ప్రాసెసర్‌ సపోర్ట్ తో వస్తుంది. ఈ లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ టీవీ మిడ్ రేంజ్ ధరలో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. లేటెస్ట్ గా వచ్చిన ఈ స్మార్ట్ టీవీ ధర, స్పెక్స్ మరియు మరిన్ని వివరాలను గురించి తెలుసుకుందాం.

Samsung Crystal 4K Neo TV: ధర

శామ్సంగ్ క్రిస్టల్ 4కె నియో స్మార్ట్ టీవీ రూ.35,990 ధరతో ప్రకటించబడింది. ఇది 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం నిర్ణయించబడిన ధర మరియు 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కూడా వుంది. ఈ స్మార్ట్ టీవీ Samsung అధికారిక ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ ఇ-కామర్స్ సైట్స్ అయిన Amazon మరియు Flipkartలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఆఫర్స్:

ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ ఇండియా నుండి టీవీని కొనుగోలు చేసే వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క వార్షిక సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు. అలాగే, ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేసే వారు డిస్నీ+హాట్‌స్టార్ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.

Samsung Crystal 4K Neo TV: స్పెక్స్

శామ్సంగ్ క్రిస్టల్ 4కె నియో స్మార్ట్ టీవీని క్రిస్పీ మరియు పదునైన పిక్చర్ క్వాలిటీ కోసం క్రిస్టల్ టెక్నాలజీతో 43-అంగుళాల USD డిస్ప్లేని కలిగి ఉంది. ఇది HDR10+, వన్ బిలియన్ ట్రూ కలర్స్ మరియు క్రిస్టల్ 4K ప్రాసెసర్‌కి కూడా మద్దతు ఇస్తుంది.ముఖ్యంగా, ఈ టీవీలో కొన్ని గేమింగ్-ఫోకస్డ్ ఫీచర్లు ఉన్నాయి. అవి ఆటో గేమ్ మోడ్, మెరుగైన ఫ్రేమ్ ట్రాన్సిషన్ మరియు Low Latency కోసం మోషన్ ఎక్స్‌లరేటర్ వంటివి.

ఇక ఆడియో మరియు కనక్టివిటి పరంగా, Dolby Digital Plus మరియు స్మార్ట్ అడాప్టివ్ సౌండ్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. ఈ టీవీలో 3HDMI, 1USB పోర్ట్, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్లను కలిగి ఉంటుంది. ఈ టీవీ Crystal Processor 4K కి జతగా 1.5GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్, బిక్స్ బై మరియు అలెక్సా సపోర్ట్‌తో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo