శామ్సంగ్ ఇండియాలో కొత్త 4K మరియు 8K QLED టీవీలను విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న Neo QLED టీవీలకు మరియు కొత్తగా విడుదల చేసిన ఈ Neo QLED టీవీలకు మద్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రెండు ప్రీమియం స్మార్ట్ టీవీలు కూడా నియో క్వాంటం పిక్చర్ ప్రోసెసర్, Dolby 5.1 Audio సపోర్ట్, నాలుగు HDMI పోర్ట్‌లు మరియు టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను కలిగి ఉన్నాయి. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీలు ఇప్పుడు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి, ఈ Neo QLED TV లను CES2022 నుండి ఆవిష్కరించింది మరియు కొన్ని నెలల తరువాత ఇండియాలో విడుదల చేసింది.
Neo QLED TV లు ఎంత గొప్ప ప్రీమియం ఫీచర్లను కలిగిరి ఉంటాయో ధర కూడా అంతే ప్రియంగా ఉంటుంది. ఈ లేటెస్ట్ శామ్సంగ్ ప్రీమియం QLED టీవీల ప్రత్యేకతలు, ధర మరియు స్పెక్స్ వంటి అన్ని వివరాలను చూద్దాం.
ప్రస్తుతం ఈ QN700A Neo QLED 8K Smart TV కేవలం ఒక్క 65 ఇంచ్ పరిమాణంలో మాత్రమే వస్తుంది. ఈ టీవీ నియో క్వాంటం ప్రాసెసర్ లైట్ ద్వారా ఇంజన్ చేయబడిన 8K రిజల్యూషన్‌ను అందిస్తుంది. అధనంగా, ఈ టీవీ HDR10+ మరియు HLG వీడియో ఫార్మాట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ కొన్ని మోడల్స్ పైన గేమ్ ప్లే ను 144Hz రిఫ్రెష్ రేట్ తో 4K రిజల్యూషన్ వద్ద అనుమతిస్తుంది. మంచి పిక్చర్ కాంట్రాస్ట్ కోసం క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీని ఉపగిస్తుంది. విజువల్స్ మాట అలావుంటే, ఈ టీవీ సౌండ్ పరంగా కూడా సూపర్. ఈ టీవీలో Dolby 5.1 సపోర్ట్ కలిగిన 70W (4.2.2) ఛానల్ స్పీకర్ సెటప్ కూడా అందించింది.
ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, బ్లూటూత్ 5.2 ,HDMI eARC, 3 USBపోర్ట్ లు, 1 కాంపోజిట్ ఇన్ (AV), 1 ఆప్టికల్ మరియు WiFi 6తో పాటు మొత్తంగా 4 HDMI పోర్ట్‌లు ఉన్నాయి. ఈ టీవీ తో పాటుగా బ్యాటరీ లేని రిమోట్ వస్తుంది.
ఇక ఈ QN85A మోడల్ టీవీ విషయానికి వస్తే ఇది QLED 4K స్మార్ట్ టీవీ మరియు 55, 65, 75 ఇంచ్ మూడు సైజుల్లో అందించింది. ఈ టీవీ ఇది టోటల్ 60W సౌండ్ అందించగల 2.2.2 ఛానల్ స్పీకర్ సెటప్ తో ఉంటుంది మరియు 2 USB పోర్ట్‌లను కలిగివుంది. ఇక మిగిలిన అన్ని ఫీచర్లు కూడా 8K మోసుల్ తో సమానంగా ఉంటాయి.
శామ్సంగ్ యొక్క ఈ ప్రీమియం 4K మరియు 8K Neo QLED స్మార్ట్ టీవీలు ప్రీమియం ధరతో ఉంటాయి. ఈ లేటెస్ట్ టీవీలు ధరలు క్రింద చూడవచ్చు
55-అంగుళాల Samsung QN85A QLED 4K స్మార్ట్ టీవీ: Rs.1,48,990
65-అంగుళాల Samsung QN85A QLED 4K స్మార్ట్ టీవీ: Rs.2,14,990
75-అంగుళాల Samsung QN85A QLED 4K స్మార్ట్ టీవీ: Rs.4,24,990
65-అంగుళాల Samsung QN700A QLED 8K స్మార్ట్ టీవీ: Rs.3,19,990
అంతేకాకుండా, మీరు 4K Neo QLED TV (QN85A)ని Rs.5000 చెల్లించి ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు మరియు 10,000 రుపాయల తగ్గింపు పొందవచ్చు. అలాగే, 8K టీవీని Rs.10,000 చెల్లించి ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు మరియు 20,000 రుపాయల తగ్గింపు పొందవచ్చు.