శామ్సంగ్ ఇండియాలో కొత్త 4K మరియు 8K QLED టీవీలను విడుదల చేసింది..!

శామ్సంగ్ ఇండియాలో కొత్త 4K మరియు 8K QLED టీవీలను విడుదల చేసింది..!
HIGHLIGHTS

శామ్సంగ్ ఇండియాలో కొత్త 4K మరియు 8K QLED టీవీలను విడుదల చేసింది

నియో క్వాంటం పిక్చర్ ప్రోసెసర్

Dolby 5.1 సపోర్ట్ కలిగిన 70W (4.2.2) ఛానల్ స్పీకర్ సెటప్

శామ్సంగ్ ఇండియాలో కొత్త 4K మరియు 8K QLED టీవీలను విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న Neo QLED టీవీలకు మరియు కొత్తగా విడుదల చేసిన ఈ Neo QLED టీవీలకు మద్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రెండు ప్రీమియం స్మార్ట్ టీవీలు కూడా నియో క్వాంటం పిక్చర్ ప్రోసెసర్, Dolby 5.1 Audio సపోర్ట్, నాలుగు HDMI పోర్ట్‌లు మరియు టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను కలిగి ఉన్నాయి. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీలు ఇప్పుడు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి, ఈ Neo QLED TV లను CES2022 నుండి ఆవిష్కరించింది మరియు కొన్ని నెలల తరువాత ఇండియాలో విడుదల చేసింది.

Neo QLED TV లు ఎంత గొప్ప ప్రీమియం ఫీచర్లను కలిగిరి ఉంటాయో ధర కూడా అంతే ప్రియంగా ఉంటుంది. ఈ లేటెస్ట్ శామ్సంగ్ ప్రీమియం QLED టీవీల ప్రత్యేకతలు, ధర మరియు స్పెక్స్ వంటి అన్ని వివరాలను చూద్దాం.

Samsung QN700A Neo QLED 8K Smart TV

ప్రస్తుతం ఈ QN700A Neo QLED 8K Smart TV కేవలం ఒక్క 65 ఇంచ్ పరిమాణంలో మాత్రమే వస్తుంది. ఈ టీవీ నియో క్వాంటం ప్రాసెసర్ లైట్ ద్వారా ఇంజన్ చేయబడిన 8K రిజల్యూషన్‌ను అందిస్తుంది. అధనంగా, ఈ టీవీ HDR10+ మరియు HLG వీడియో ఫార్మాట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ కొన్ని మోడల్స్ పైన గేమ్ ప్లే ను 144Hz రిఫ్రెష్ రేట్ తో 4K రిజల్యూషన్ వద్ద అనుమతిస్తుంది. మంచి పిక్చర్ కాంట్రాస్ట్ కోసం క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీని ఉపగిస్తుంది. విజువల్స్ మాట అలావుంటే, ఈ టీవీ సౌండ్ పరంగా కూడా సూపర్. ఈ టీవీలో Dolby 5.1 సపోర్ట్ కలిగిన 70W (4.2.2) ఛానల్ స్పీకర్ సెటప్ కూడా అందించింది.

Neo QLED 8k.jpg

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, బ్లూటూత్ 5.2 ,HDMI eARC, 3 USBపోర్ట్ లు, 1 కాంపోజిట్ ఇన్ (AV), 1 ఆప్టికల్ మరియు WiFi 6తో పాటు మొత్తంగా 4 HDMI పోర్ట్‌లు ఉన్నాయి. ఈ టీవీ తో పాటుగా బ్యాటరీ లేని రిమోట్ వస్తుంది.             

Samsung QN85A Neo QLED 4K Smart TV

Neo QLED 4k(1).jpg

ఇక ఈ QN85A మోడల్ టీవీ విషయానికి వస్తే ఇది QLED 4K స్మార్ట్ టీవీ మరియు 55, 65, 75 ఇంచ్ మూడు సైజుల్లో అందించింది. ఈ టీవీ ఇది టోటల్ 60W  సౌండ్ అందించగల 2.2.2 ఛానల్ స్పీకర్ సెటప్ తో ఉంటుంది మరియు 2 USB పోర్ట్‌లను కలిగివుంది. ఇక మిగిలిన అన్ని ఫీచర్లు కూడా 8K మోసుల్ తో సమానంగా ఉంటాయి.

Neo QLED 4K మరియు 8K: ధర

శామ్సంగ్ యొక్క ఈ ప్రీమియం 4K మరియు 8K Neo QLED స్మార్ట్ టీవీలు ప్రీమియం ధరతో ఉంటాయి. ఈ లేటెస్ట్ టీవీలు ధరలు క్రింద చూడవచ్చు    

55-అంగుళాల Samsung QN85A QLED 4K స్మార్ట్ టీవీ: Rs.1,48,990

65-అంగుళాల Samsung QN85A QLED 4K స్మార్ట్ టీవీ: Rs.2,14,990

75-అంగుళాల Samsung QN85A QLED 4K స్మార్ట్ టీవీ: Rs.4,24,990

65-అంగుళాల Samsung QN700A QLED 8K స్మార్ట్ టీవీ: Rs.3,19,990

అంతేకాకుండా, మీరు 4K Neo QLED TV (QN85A)ని Rs.5000 చెల్లించి ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు మరియు 10,000 రుపాయల తగ్గింపు పొందవచ్చు. అలాగే, 8K టీవీని Rs.10,000 చెల్లించి ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు మరియు 20,000 రుపాయల తగ్గింపు పొందవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo