Samsung Crystal 4K Dynamic Series నుంచి రెండు కొత్త స్మార్ట్ టీవీలు శామ్సంగ్ విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ లను ఎయిర్ స్లిమ్ డిజైన్ మరియు డైనమిక్ క్రిస్టల్ కలర్ వంటి మరిన్ని ఫీచర్స్ తో శామ్సంగ్ లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుంచి లాంచ్ చేసిన రెండు కొత్త స్మార్ట్ టీవీల ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈ సిరీస్ నుంచి UA43DUE80AKLXL మోడల్ నెంబర్ తో 43 ఇంచ్ స్మార్ట్ టీవీని, UA55DUE80AKLXL మోడల్ నెంబర్ తో 55 ఇంచ్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఈ రెండు టీవీల ధర మరియు ఆఫర్లు ఇప్పుడు చూద్దాం.
శామ్సంగ్ 43 ఇంచ్ టీవీ ధర : రూ. 41,990
శామ్సంగ్ 55 ఇంచ్ టీవీ ధర : రూ. 59,990
ఈ రెండు స్మార్ట్ టీవీల పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ టీవీలను అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేసే యూజర్లకు ఈ ఆఫర్లు అందిస్తుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీలు అమెజాన్ స్పెషల్ గా లాంచ్ అయ్యాయి. ఇక ఆఫర్ వివరాల్లోకి వెళితే, 43 ఇంచ్ టీవీ పైన రూ. 2,000 మరియు 55 ఇంచ్ టీవీ పై రూ. 3,000 ప్రైమ్ డిస్కౌంట్ కూపన్ ను అందించింది.
అంతేకాదు, 55 ఇంచ్ స్మార్ట్ టీవీని HDFC కార్డ్స్ తో కొనేవారికి రూ. 3,500 డిస్కౌంట్ మరియు OneCard క్రెడిట్ తో కొనేవారికి రూ. 3,000 డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ స్మార్ట్ టీవీలు అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. ఈ టీవీ ఆఫర్స్ చెక్ చేయడానికి Click Here
Also Read: Realme Narzo 70 Turbo 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!
ఈ కొత్త స్మార్ట్ టీవీలు Crystal Processor 4K పిక్చర్ ఇంజిన్ తో అందించింది. ఈ టీవీలు HDR 10+, 4K అప్ స్కేలింగ్, HLG, మెగా కాంట్రాస్ట్, UHD డిమ్మింగ్ మరియు మోషన్ యాక్సిలరేటర్ వంటి ఫీచర్ లను కలిగి ఉన్నాయి. ఈ టీవీలు Tizen OS తో పని చేస్తాయి మరియు Web బ్రౌజ్ అవకాశం వుంది. ఈ టీవీ లో 20W సౌండ్ అందించే 2ch ఆడియో స్పీకర్లు మరియు Q-Symphony సౌండ్ సపోర్ట్ కూడా వుంది.
ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ Object Tracking Sound సపోర్ట్ మరియు అడాప్టివ్ ఆడియోతో కూడా వస్తుంది. ఈ టీవీ HDMI eARC/ARC, USB -A పోర్ట్, బ్లూటూత్, LAN, ఆప్టికల్ మరియు WiFi తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ అలెక్సా స్పీకర్ తో పని చేస్తుంది మరియు Buds Auto switch ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ టీవీలతో సోలార్ సెల్ రిమోట్ ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.