Redmi Smart Tv: Dolby Vision స్మార్ట్ టీవీని తీసుకొస్తున్న Xiaomi

Updated on 28-Jan-2022
HIGHLIGHTS

ఇండియాలో మరొక స్మార్ట్ టీవీ ని లాంచ్ చేయడానికి షియోమి సిద్ధమవుతోంది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ Redmi Smart Tv X43

ఈ స్మార్ట్ టీవీని ఫిబ్రవరి 9న ఇండియాలో ప్రకటించనుంది

ఇండియాలో మరొక స్మార్ట్ టీవీ ని లాంచ్ చేయడానికి షియోమి సిద్ధమవుతోంది. షియోమి అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ గురించి టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీని Redmi Smart Tv X43 పేరుతో చూపిస్తోంది మరియు కొన్ని ఫీచర్లను కూడా వెల్లడించింది. షియోమి ఈ స్మార్ట్ టీవీని ఫిబ్రవరి 9న ఇండియాలో ప్రకటించనుంది.

ఇక ఈ స్మార్ట్ టీవీ గురించి టీజింగ్ చేసిన మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, Redmi Smart Tv X43 టీవీని 4K HDR మరియు Dolby Vision సపోర్ట్ తో తీసుకువస్తునట్లు పేర్కొంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవిలో అందించిన సౌండ్ టెక్నలజీ గురించి కూడా తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు హెవీ సౌండ్ అందించగల 30W స్పీకర్లను కలిగి ఉంటుంది.

ఇక డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే, ఈ Redmi Smart Tv X43 పేరు సుచినట్లుగానే 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కావచ్చు. ఇందులో, అందించిన ప్రోసెసర్ గురించి పూర్తిగా వివరించలేదు కానీ, ఫ్యూచర్ రెడీ మరియు ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ తో తీసుకువస్తునట్లు మాత్రం తెలిపింది. ఇక OS పరంగా లేటెస్ట్ PatchWall UI తో వస్తుందని ఊహించవచ్చు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :