Redmi నుండి వస్తున్న మరొక రెండు కొత్త స్మార్ట్ టీవీలు..ఫీచర్లు అదుర్స్..!
Redmi రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తోంది
Android 11 OS తో లాంచ్
IMDb తో లేటెస్ట్ PatchWall 4
Redmi ఇండియాలో రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తోంది. రెడ్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీలను సెప్టెంబర్ 22 వ తేది మద్యహ్నం 12 గంటలకు ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా విడుదల చేస్తోంది. ఈ టీవీలను Android 11 OS తో లాంచ్ చేస్తున్నట్లు షియోమి ప్రకటించింది. కేవలం ఇది మాత్రమే కాదు మంచి సౌండ్ టెక్నాలజి మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో లాంచ్ చేస్తున్నట్లు టీజ్ చేస్తోంది. మరి ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ ల గురించి చూద్దాం.
రెడ్ మీ ఈ స్మార్ట్ టీవీలను రెండు సైజుల్లో ఆవిష్కరించనుంది. వాటిలో 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టీవీలను అల్ రౌండ్ ఎంటర్టైన్ మెంట్ అందించే విధంగా తీసుకువస్తునట్లు వెల్లడించింది. ఈ టీవీలను Android 11 OS తో లాంచ్ చేస్తున్నట్లు టీజ్ చేస్తోంది. అయితే, ఈ రేండు టీవీలలో ఏటీవికి ఈ లేటెస్ట్ OS అందిస్తుందని ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈ టీవీల ను IMDb తో లేటెస్ట్ PatchWall 4 తో అందిస్తుంది.
సౌండ్ టెక్నాలజీ పరంగా, ఈ టీవీలను Dolby Audio మరియు DTS-X Virtual సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో తీసుకువస్తునట్లు టీజ్ చేసింది. కనెక్టివిటీ పరంగా, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 మరియు మరిన్ని అప్షన్ లను కూడా టీవీలకు జోడించింది. మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ టీవీలలో Vivid పిక్చర్ ఇంజన్ కూడా ఉన్నట్లు రెడ్ మీ ప్రకటించింది. ఈ టీవీల కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ అందించింది. అంటే, ఈటీవీలు అమెజాన్ ప్రత్యేకంగా లభిస్తాయి.