Realme లేటెస్ట్ టెక్నాలజీతో SLED టీవీలను ప్రకటించనుంది

Realme లేటెస్ట్ టెక్నాలజీతో SLED టీవీలను ప్రకటించనుంది
HIGHLIGHTS

ఇప్పటి వరకు, LED బ్యాక్‌లైటింగ్, OLED TV మరియు QLED TV లతో టీవీలను చూశాము.

SLED మరియు ఇతర రకాల బ్యాక్‌లైటింగ్ ‌ల మధ్య ఏమైనా తేడా ఉందా అనే విషయం ఆసక్తికరంగా ఉంటుంది.

Realme 55-అంగుళాల 4K SLED టీవీని ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది

Realme 55-అంగుళాల 4K  టీవీని ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది మరియు ఇది ఈ టీవీని SLED అనే పేరును ఖరారు చేయనుంది . కాబట్టి, SLED ఎలా  నిలుస్తుంది? దీనికి రియల్ మీ వెల్లడించిన సమాచారం నుండి, ఇది టీవీ యొక్క బ్యాక్‌లైటింగ్ కోసం ఉపయోగించే స్పెక్ట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (SPD) టెక్నాలజీకి నిదర్శనం అని ఉహించవచ్చు. అయితే, ఇది టీవీలో చూసే అనుభవాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనకు మాత్రమే తెలుస్తుంది.

ఇప్పటి వరకు, LED బ్యాక్‌లైటింగ్, OLED TV మరియు QLED TV లతో టీవీలను చూశాము. కాబట్టి, SLED మరియు ఇతర రకాల బ్యాక్‌లైటింగ్ ‌ల మధ్య ఏమైనా తేడా ఉందా అనే విషయం ఆసక్తికరంగా ఉంటుంది.

Realme 55-అంగుళాల SLED TV యొక్క ఊహాజనిత ఫీచర్లు

ఈ టీవీకి SLED బ్యాక్‌లైటింగ్ ఉంటుందని మనకు తెలుసు, అయితే దీని గురించి మాకు మరింత ఎక్కువ సమాచారం మాత్రం తెలియదు. ఇప్పటి వరకు దీని OS గురుంచి కూడా తెలియదు, కాని రియల్ మీ యొక్క మునుపటి టీవీ Android TV లో నడుస్తున్నందున, ఇది Android TV లో కూడా నడుస్తుందని మేము భావిస్తున్నాము.

NTSC కలర్ స్పేస్‌లో 108 శాతం మద్దతు ఇస్తున్నట్లు టివి పేర్కొంది. దాని అర్థం ఏమిటి?  NTSC కలర్ గాముట్ అడోబ్ RBG లో 98 శాతం. అడోబ్ RGB కలర్ గాముట్ sRGB / Rec.709 కన్నా 17 శాతం పెద్దది. DCI-P3 కలర్ గాముట్ sRGB / Rec.709 కన్నా 26 శాతం పెద్దది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, OnePlus దాని OnePlus U 1 55-అంగుళాల 4K  HDR టివి 93 శాతం డిసిఐ-పి 3 కలర్ స్పేస్‌ను కలిగి ఉందని చెప్పారు. ఇది వాస్తవ-ప్రపంచ వీక్షణ అనుభవాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది రియల్‌ మీ టీవీ మన ముందుకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది.

ఈ రియల్ మీ SLED TV మరింత సౌకర్యవంతమైన వీక్షణ అనుభవం కోసం TUV Rheinland తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్ ‌ను కలిగి ఉంది.

రియల్ మీ భారతదేశంలో టీవీని ప్రారంభించడం ఇదే మొదటిసారి కాదు. ఈ కంపెనీ 32 అంగుళాల హెచ్‌డి రెడీ మరియు 43 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి టివిలు మార్కెట్లో అందుబాటులో వున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo