ఈ నెల చివరికి రియల్మి రెండు కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్లో విడుదల చేస్తోంది. దీనికోసం, మే 31 న ఈ కొత్త స్మార్ట్ టీవీ లను లాంచ్ డేట్ ను ప్రకటించింది. అంతేకాదు, అదే రోజు Realme X7 Max 5G స్మార్ట్ ఫోన్ ను కూడా హై ఎండ్ ఫీచర్లతో విడుదల చెయ్యబోతోంది. టీవీ విభాగాల్లో, 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ లో స్మార్ట్ టీవీలను విడుదల చేసిన రియల్మి ఇప్పుడు Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో రెండు పెద్ద సైజులో స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది.
రియల్మి యొక్క ఈ కొత్తగా టీవీల ప్రత్యేకతలను కూడా తన అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియపరిచింది. ఈ టీవీలను 4K Cinematic ఎక్స్ పీరియన్స్ అందించే విధంగా Dolby Vision 4K Display తో తెస్తోంది. ఈ టీవీలు 4K రిజల్యూషన్ (3840×2160) తో వస్తాయి. ఈ టీవీలను 43 ఇంచ్ మరియు 50 ఇంచ్ రెండు సైజుల్లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవి 4K HDR సపోర్ట్ మరియు క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ తో వస్తాయి.
ఈ టీవీ కోసం అందించిన టీజింగ్ పోస్టర్ ను చూస్తుంటే ఈ టీవీ చాలా సన్నని అంచులతో కనిపిస్తోంది. అంతేకాదు, టీవీ డిజైన్ కూడా చాలా క్లీన్ మరియు స్టన్నింగ్ గా కనిపిస్తోంది. ఇక సౌండ్ పరంగా మంచి టెక్నలాజినే ఈ టీవీలలో ప్రకటించింది. ఈ టీవీలను పెద్ద సౌండ్ అందించగల 24W క్వాడ్ స్పీకర్లతో మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో తీసుకువస్తోంది. అలాగే, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది.