టీవీ విభాగంలో ఎప్పుడూ కూడా హాటెస్ట్ స్పేస్ ఏదంటే బడ్జెట్ సెగ్మెంట్ అని ఖఛ్చితంగా చెప్పొచ్చు మరియు ఈ విభాగంలో ప్రస్తుతం హవా కోనసాగిస్తున్న వాటిలో Xiaomi కూడా ఒక ప్రధాన బ్రాండ్. ఆండ్రాయిడ్ ఆధారంగా ప్యాచ్‌వాల్ UI లో నడుస్తున్న MiTV లతో షావోమి ముందుకుసాగుతోంది. అయితే, రియల్మి ఇప్పుడు సరికొత్త కొత్త పోటీదారుడు ఈ లిస్ట్ లో వచ్చిచేరాడు. ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో నడుస్తున్న ఈ బ్రాండ్, భారతదేశంలో రెండు టీవీలను విడుదల చేసింది. రియల్మి నుండి ఈ కొత్త టీవీలు 32 మరియు 43-అంగుళాల స్క్రీన్ సైజుల్లో లభిస్తాయి, వీటి ధర రూ .12,999 మరియు రూ .21,999. స్క్రీన్ పరిమాణం మరియు ధర దాదాపుగా షావోమికి పోటీగా కనిపిస్తాయి. కాబట్టి, ఈ టీవీల ధర ఒకేలా ఉన్నందున, మీకు ఏది సరైన టీవీగా ఉందనున్నదో చూద్దాం. గమనిక, ఈ రియల్మి టీవీలను ఇంకా రివ్యూ చేయనందున, ఈ కంపారిజన్ పూర్తిగా ఈ 2 టీవీల ప్రత్యేకతలపై ఆధారపడి ఉంటుంది.
Particulars | Realme Smart TV 32-inch | Mi LED TV 4A PRO 32 | Realme Smart TV 43-inch | Mi LED TV 4A PRO 43 |
Display size | 32-inch | 32-inch | 43-inch | 43-inch |
Display resolution | 1366×768p | 1366×768p | 1920x1080p | 1920x1080p |
HDR support | Yes | No | Yes | No |
OS | Android TV | Android TV | Android TV | Android TV |
UI | Android TV | Android TV and PatchWall | Android TV | Android TV and PatchWall |
HDMI ports | 3 | 3 | 3 | 3 |
HDMI ARC support | Yes | Yes | Yes | Yes |
USB Ports | 2 | 2 | 2 | 2 |
Wi-Fi | Yes, 2.4GHz | Yes, 2.4GHz | Yes, 2.4GHz | Yes, 2.4GHz |
Netflix Support | Yes | Yes | Yes | Yes |
Prime Videos Support | Yes | Yes | Yes | Yes |
CPU | ARM Cortex A53 Quad-core CPU | Amlogic Cortex A53 quad-core | ARM Cortex A53 Quad-core CPU | Amlogic Cortex A53 quad-core |
RAM | 1GB | 1GB | 1GB | 1GB |
Storage | 8GB | 8GB | 8GB | 8GB |
Voice-enabled remote control | Yes | Yes | Yes | Yes |
Bluetooth | Yes, 5.0 | Yes, 4.2 | Yes, 5.0 | Yes, 4.2 |
Audio output | 24W | 20W | 24W | 20W |
పై పట్టిక నుండి, రెండు టీవీలు దాదాపుగా ఒకేవిధమైన ఫీచర్లతో తెచ్చాయని స్పష్టమవుతోంది. అయితే, రియల్మి టీవీ తన HDR గురించి ఎక్కువగా చెబుతున్నందున, ఈ టీవీ HDR పనితీరును చెక్ చేయడానికి మేము ఈ టీవీని రివ్యూ చేయనున్నాము. పిక్చర్ నాణ్యత పరంగా, రియల్మి టీవీలోని HDR అతి పెద్ద భేదం అనిపిస్తుంది. కాని మనం పేపర్ పైన చూసిన స్పెక్స్ నుండి మాత్రమే దీని గురించి మనం ఊహిస్తున్నాము. షావోమి టీవీ మరియు రియల్మీ టీవీ బ్లూటూత్ కనెక్టివిటీ విసిహానికి వస్తే, షావోమి టీవీల్లో బ్లూటూత్ 4.2 సపోర్ట్ ఉంటే, రియల్మి టీవీలో బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉన్నాయి.
అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, షావోమి టీవీలోని 20W తో పోల్చినప్పుడు 24W సౌండ్ అవుట్పుట్ రియల్మీ లో కనిపిస్తుంది. అయితే, పేపర్ పైన చూపిన 4W చిన్న మొత్తం కావచ్చు, కానీ “క్వాడ్-స్పీకర్” సెటప్ నమ్మదగినది అయితే, మనకు మంచి సౌండ్ తో బడ్జెట్ టీవీ కావచ్చు. మేము ఈ టీవీని రివ్యూ చేసినప్పుడు వివరిస్తాము.
రెండు టీవీలు వారి స్వంత వాయిస్-ఎనేబుల్డ్ రిమోట్ కంట్రోల్‌తో వస్తాయి, అయితే షావోమికి UI తో వస్తే, రియల్మి టీవీ ఆండ్రాయిడ్ టీవీ UI ని తెస్తుంది. ఏదేమైనా, షావోమి తన పాచ్ వాల్ UI ని కూడా తెస్తుంది మరియు కొత్త కంటెంట్ ప్రొవైడర్లతో మరియు కొత్త ఫీచర్లతో ఈ UI ని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడంలో కంపెనీ అవిశ్రాంతంగా కృషి చేసింది.
మొత్తంమీద, స్పెసిఫికేషన్లను గమనిస్తే, ఈ రెండూ కూడా స్పెక్స్ పరంగా దాదాపుగా ఉన్నందున వీటిలో ఒకదానిని సిఫార్సు చేయడం కష్టం. కానీ, రియల్మి టీవిలో అధిక ప్రయోజనం పొందగల ఒక విషయంగా దాని HDR ఫీచర్ గురించి చూడవచ్చు. దీని గురించి ఖచ్చితంగా చెప్పడానికి, మేము ఈ టీవీని తనిఖీ చేయాలి. UI విషయానికి వస్తే, షావోమి ప్యాచ్‌వాల్ మరియు ఆండ్రాయిడ్ టివి రెండింటినీ వినియోగదారులకు అందించే ప్రయోజనం ఉంది, అయితే రియల్మి కు ఆండ్రాయిడ్ టివి మాత్రమే ఉంది.