Realme స్మార్ట్ టీవీ పైన 1000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్

Updated on 27-Jan-2022
HIGHLIGHTS

Realme Smart TV Neo 32 పైన 1000 రూపాయల డిస్కౌంట్ అఫర్

ఈ అఫర్ జనవరి 31 న ముగుస్తుంది

ఈ Realme స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో పొందవచ్చు

గత సంవత్సరం రియల్ మీ ఇండియాలో విడుదల చేసిన Realme Smart TV Neo 32 పైన 1000 రూపాయల డిస్కౌంట్ అఫర్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ ఇప్పుడు realme అధికారిక వెబ్సైట్ పైన 1000 రూపాయల వరకూ డిస్కౌంట్ అందుకునే అఫర్ తో లభిస్తోంది. 2022 రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుండి రియల్ మి ఈ అఫర్ ను ప్రకటించింది మరియు ఈ అఫర్ జనవరి 31 న ముగుస్తుంది. ఈ డిస్కౌంట్ కూపన్ రూపంలో అందించింది. ఒకవేళ Flipkart నుండి కొనాలనుకుంటే మాత్రం Axis మరియు citi బ్యాంక్ కార్డ్స్ ద్వారా 10% అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.  

ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ Dolby Audio, క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్  మరియు స్మార్ట్ క్వాడ్ కోర్ వంటి లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో వచ్చింది.

Realme Smart TV Neo 32: ప్రైస్&స్పెక్స్

ఈ లేటెస్ట్ రియల్ మీ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ సైజులో HD రెడీ రెజల్యూషన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ రూ.14,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యింది. అయితే, ప్రస్తుతం Realme.com మరియు Flipkart ల నుండి రూ.13,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. 

ఈ రియల్ మీ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ టీవీ మంచి షార్ప్ కలర్స్ అందించడానికి Chroma Boost Picture Engineతో వస్తుంది. అద్భుతమైన కలర్స్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి Dolby Audi సౌండ్ టెక్నాలజీ కలిగిన 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయి. ఈ స్మార్ట్ టీవీ యొక్క డిస్ప్లే కళ్ళకు హానికలిగించదు. ఎందుకంటే, ఇది TUV Rheinland Low Blue Light సర్టిఫికేషన్ తో వస్తుంది.        

ఇక కనెక్టివిటీ పరంగా, 2HMDI పోర్ట్స్, 1 USB పోర్ట్, 1LAN , 1AV కనెక్షన్ మరియు ఇది Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివుంది. టీవీ స్మార్ట్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు ఇన్ బిల్ట్ యూట్యూబ్ 2021 తో వస్తుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :