Realme Smart TV 4K స్మార్ట్ టీవీలను ఈరోజు లాంచ్ చేసింది. రియల్మి యొక్క ఈ సరికొత్త 4K స్మార్ట్ టీవీ లు మంచి ప్రత్యేకతలతో వచ్చాయి. ఇవి గొప్ప పిక్చర్ క్వాలీటి, పెద్ద సైజు మరియు హెవీ సౌండ్ అందించే శక్తితో వస్తాయి. మొత్తంగా చెప్పాలంటే, ఈ టీవీలు మీ ఇంటిని సినిమా హల్ గా మార్చేస్తాయి. మరి ఈ కొత్త టీవీ ల గురించి పూర్తిగా తెలుసుకుందామా?.
రియల్మి కొత్త టీవీలు రెండు సైజులలో లభిస్తాయి
1. Realme Smart TV 4K (43 Inch) : రూ.27,999
2. Realme Smart TV 4K (50 Inch) : రూ.39,999
జూన్ 4వ తేదీ నుండి ఈ టీవీ సేల్ మొదలవుతాయి. Flipkart మరియు రియల్మి వెబ్సైట్ నుండి ఈ టీవీలను కొనుగోలు చెయవచ్చు.
ఈ రెండు Realme Smart TV 4K టీవీలు కూడా ఒకేవిధమైన ప్రత్యేకతలతో వస్తాయి. అయితే, వీటి సైజుల్లో మాత్రమే మార్పు కనిపిస్తుంది. ఈ టీవీలు Dolby Vision సపోర్ట్ తో వస్తాయి మరియు సినిమాటిక్ 4K అనుభవాన్ని అందిస్తాయి. ఇందులో 4K స్క్రీన్ వుంటుంది మరియు ఇది Croma Boost సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ లను దాదాపుగా కనిపించని విధంగా సన్నని అంచులతో తయారు చేసింది. ఇది 90% DCI-P3 వైడ్ కలర్ గ్యాముట్, 83% NTSC వైడ్ కలర్ గ్యాముట్ సపోర్ట్ ఇవ్వబడింది. అంటే, మంచి రంగులతో కూడిన స్పష్టమైన పిక్చర్ ని మీరు ఆస్వాదించవచ్చు.
ఇక సౌండ్ పరంగా, ఈ టీవీల పైన రియల్మి మరింత శ్రద్ద తీసుకుంది. ఈ టీవీలు Dolby Atmos మరియు DTS Studio Sound రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ టీవీ లలో నాలుగు స్పీకర్లతో భారీ 24W సౌండ్ కూడా ఇచ్చింది. ఇక కనెక్టివిటీ పరంగా WiFi, LAN, 2HDMI, 1 HDMI Arc మరియు USB పోర్ట్స్ తో పాటుగా Bluetooth 5.0 కి కూడా సపోర్ట్ కలిగివుంది. ఇందులో మీడియా టెక్ ప్రాసెసర్ ని అందించింది మరియు ఇది ఆండ్రాయిడ్ టీవీ. ఇది Android 10 తో పనిచేస్తుంది గూగుల్ అసిస్టెంట్ తో వస్తుంది. ఈ టీవీలు Netflix, Youtube మరియు Prime Video వంటి బిల్ట్ ఇన్ యాప్స్ తో వస్తుంది.