Realme TV: రెండు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేస్తున్న రియల్ మీ..!!

Updated on 11-May-2022
HIGHLIGHTS

Realme ఇండియాలో కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది

ఒకటి 40 ఇంచ్ సైజుతో మరొకటి 43 ఇంచ్ సైజుతో తీసుకువస్తునట్లు ప్రకటించింది

ఆకట్టుకునేలా HDR 10 సపోర్ట్, ప్రీమియం బెజెల్ లెస్ డిజైన్ తో తీసుకువస్తోంది

Realme ఇండియాలో కొత్త  స్మార్ట్ టీవీలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ టీవీలవ్ ఒకటి 40 ఇంచ్ సైజుతో మరొకటి 43 ఇంచ్ సైజుతో తీసుకువస్తునట్లు కూడా ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా FHD రిజల్యూషన్ తో ఉండవచ్చు. అయితే, ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ఫీచర్ల పరంగా ఆకట్టుకునేలా HDR 10 సపోర్ట్, ప్రీమియం బెజెల్ లెస్ డిజైన్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో తీసుకువస్తోంది. ఈ స్మార్ట్ టీవీలను రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాలకు విడుదల చేస్తున్నట్లు రియల్ మీ ప్రకటించింది.  

రేపు ఇండియాన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ Realme Smart TV X Full HD స్మార్ట్ టీవీలు 40 మరియు 43 ఇంచ్ సైజులలో రానున్నాయి. రియల్ సినీమ్యాటిక్ అనుభవాన్ని అందించే క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ ను అందించినట్లు కంపెనీ చెబుతోంది. ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్ టీవీలు ARM కోర్టెక్స్ A55 CPU మరియు Mali-G31 GPU క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ ను కలిగి ఉంటాయి. అలాగే, పైన తెలిపిన విధంగా ఈ రియల్ మీ స్మార్ట్ టీవీ X ఫుల్ HD టీవీలు HDR 10 మరియు HLG రెండు ఫార్మాట్ లకు మద్దతును ఇస్తాయి.

ఇక యాతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీలు Android 11 OS పైన నడుస్తాయి. అంతేకాదు, ALLM (ఆటో లో లెటెన్సీ మోడ్) తో కూడా వస్తుంది. సౌండ్ పరంగా, 24W సౌండ్ అవుట్ పుట్ అందించ గల క్వాడ్ స్పీకర్ సెటప్ ఈ టీవీలలో ఉంటుంది. ఇందులో, రెండు సిల్క్ డూమ్ ట్వీటర్ లు మరియు రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉంటాయి. ఈ సెటప్ కి తోడు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా అందుతుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :