Smart Tv: రియల్ మీ నుండి మరొక స్మార్ట్ టీవీ…ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
రియల్ మీ మరొక కొత్త బడ్జెట్ స్మార్ట్ టీవీని లాంచ్ చేస్తోంది
ప్రీమియం లుక్ కలిగిన బెజెల్-లెస్ డిజైన్
చాలా ఆకర్షణీయమైన డిజైన్
రియల్ మీ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అనేకమైన LED టీవీలను విడుదల చేసింది. ఇప్పుడు కొత్తగా మరొక బడ్జెట్ స్మార్ట్ టీవీని విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 24 వ తేదికి ఈ స్మార్ట్ టీవీ ని ఇండియాలో లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది మరియు ఈ టీవీ లాంచ్ గురించి Flipkart ఇప్పటికే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ని కూడా అందించింది. రియల్ మీ కొత్తగా మార్కెట్లోకి లాంచ్ చెయ్యడానికి సిద్దమవుతున్న ఈ స్మార్ట్ టీవీ గురించి చూద్దాం.
Realme Smart TV Neo (32 inch)
సెప్టెంబర్ 24 వ తేదికి ఇండియాలో విడుదల చేయనున్న ఈ 32 ఇంచ్ రియల్ మీ స్మార్ట్ టీవీని ప్రీమియం లుక్ కలిగిన బెజెల్-లెస్ డిజైన్ తో అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ టీవీ కళ్ళకు హానికలిగించని విధంగా TUV Rheinland లో బ్లు లైట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇది ఇన్ బిల్ట్ Youtube 2021 ను కలిగివుంటుంది. టీజర్ నుండి ఈ టీవీ చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో కనిపిస్తోంది.
ఇక సౌండ్ టెక్నాలజీ పరంగా, ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించాలా డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి వుంది. అంతేకాదు, మంచి క్వాలిటీ సౌండ్ అందించడానికి ఈ టీవిని Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో తీసుకువస్తోంది. మొత్తంగా లేటెస్ట్ ఫీచర్లతో ఈ స్మార్ట్ టీవీ ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు కనిపిస్తోంది.