Realme కొత్త తన కొత్త స్మార్ట్ టీవీల లాంచ్ డేట్ ప్రకటించింది. మే 31 న రెండు కొత్త స్మార్ట్ టీవీ లను హై ఎండ్ ఫీచర్లతో విడుదల చెయ్యబోతోంది. దీనికి సంభందించి మీడియా ప్రకటన కూడా పంపించింది. ఇప్పటికే, 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ లో స్మార్ట్ టీవీలను విడుదల చేసిన రియల్మి ఇప్పుడు Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో రెండు సైజులో స్మార్ట్ టీవీలను ఇండియాలో విడుదల చేస్తోంది.
రియల్మి కొత్తగా లాంచ్ చెయ్యనున్న ఈ కొత్త స్మార్ట్ టీవీ ల గురించి ఎక్కువ సమాచారం ఇంకా అందించ లేదు. కానీ, ఈ టీవీలను 43 ఇంచ్ మరియు 50 ఇంచ్ రెండు సైజుల్లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ టీవీలు 4K సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయని కూడా చెబుతోంది.
ఈ టీవీ కోసం అందించిన టీజింగ్ పోస్టర్ ను చూస్తుంటే ఈ టీవీ చాలా సన్నని అంచులతో కనిపిస్తోంది. అంతేకాదు, టీవీ డిజైన్ కూడా చాలా క్లీన్ మరియు స్టన్నింగ్ గా కనిపిస్తోంది. ఎప్పటి కప్పుడు క్రొత్త టెక్నలాజితో ప్రోడక్ట్స్ ని చాలా చవక ధరలోనే అందించే సంస్థగా రియల్మి గుర్తింపు వుంది. కాబట్టి, Realme ఈ కొత్త టీవీలను చాలా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్ లతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు.