Realme 32 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Realme మరొక కొత్త 32 ఇంచ్ స్మార్ట్ టీవీని ప్రకటిస్తోంది
FHD రిజల్యూషన్ తో తీసుకువస్తోంది
క్వాడ్ స్టీరియో స్పీకర్ సెటప్ తో ఉంటుంది
Realme మరొక కొత్త 32 ఇంచ్ స్మార్ట్ టీవీని ప్రకటిస్తోంది. అయితే, ఈ టీవీ 32 ఇంచ్ టీవీ లలో సాధారణంగా వచ్చే HD Ready స్క్రీన్ తో కాకుండా FHD రిజల్యూషన్ తో తీసుకువస్తోంది. అంతేకాదు, తక్కవ అంచులు కలిగిన స్క్రీన్ పెద్ద సౌండ్ అందించ గల స్పీకర్లతో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ టీవీ ని రేపు మధ్యాహ్నం 12:30 నిముషాలకు జరగనున్న ప్రత్యేక లాంచ్ ఈవెంట్ ద్వారా ఇండియాయాలో లాంచ్ చెయ్యడానికి సిద్దమవుతోంది.
ఈ Realme అప్ కమింగ్ స్మార్ట్ టీవీ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్లను ఇప్పటికే రియల్మి వెల్లడించింది. ఈ 32 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ 1920×1080 రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ లో కూడా క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ టెక్నాలజీ ఉంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీలో ప్రీమియం బెజెల్-లెస్ డిజైన్ కూడా అందించింది. ఈ టీవీ Android 9 పై OS పైన పనిచేస్తుంది.
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ Realme అప్ కమింగ్ స్మార్ట్ టీవీ రిచ్ సౌండ్ అందించే క్వాడ్ స్టీరియో స్పీకర్ సెటప్ తో ఉంటుంది. అంటే, ఈ టీవిలో నాలుగు స్పీకర్లు అందుతాయి. అలాగే, ఇందులో Dolby Audio సౌండ్ టెక్నాలజీని అఫర్ చేస్తోంది. కాబట్టి, క్లారిటీ కలిగిన పెద్ద సౌండ్ ఈ టీవీ లో అందుతుంది.