ఈరోజు ఇండియాలో రియల్ మీ రెండు కొత్త స్మార్ట్ టీవీలను ప్రకటించింది. Smart TV X Full HD సిరీస్ నుండి తీసుకువచ్చిన ఈ రెండు టీవీలు కూడా FHD రిజల్యూషన్ తో వస్తాయి. అయితే, వీటిలో ఒకటి 40 ఇంచ్ పరిమాణంలో మరియు రెండవ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో అందించింది. కానీ, ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన క్వాడ్ స్పీకర్ సెటప్ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. ఇండియన్ మార్కెట్లోకి రియల్ మీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ లేటెస్ట్ ఫుల్ HD స్మార్ట్ టీవీల ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం.
Realme Smart TV X Full HD స్మార్ట్ టీవీలు 40 మరియు 43 ఇంచ్ సైజులలో వచ్చాయి. ముందుగా వచ్చిన రియల్ మీ స్మార్ట్ టీవీల మాదిరిగానే సినీమ్యాటిక్ అనుభవాన్ని అందించే క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ ను ఈ టీవీలలో కూడా అందించింది. అదనంగా, ఈ రియల్ మీ స్మార్ట్ టీవీ X ఫుల్ HD టీవీలు HDR 10 మరియు HLG రెండు ఫార్మాట్ లకు మద్దతును ఇస్తాయి. కాబట్టి, ఈ స్మార్ట్ టీవీల నుండి మరింత స్పష్టమైన విజువల్స్ ఆశించవచ్చు. ఈ స్మార్ట్ టీవీలు ARM కోర్టెక్స్ A55 CPU మరియు Mali-G31 GPU క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ ను కలిగి ఉంటాయి.
ఇక మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా Android 11 OS పైన నడుస్తాయి. అంతేకాదు, ALLM (ఆటో లో లెటెన్సీ మోడ్) తో కూడా వస్తుంది. సౌండ్ పరంగా, Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 24W సౌండ్ అవుట్ పుట్ అందించ గల క్వాడ్ స్పీకర్ సెటప్ ఈ టీవీలలో ఉంటుంది. ఇందులో, రెండు సిల్క్ డూమ్ ట్వీటర్ లు మరియు రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉంటాయి. ఈ సెటప్ కి తోడు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా అందుతుంది. ఈ రెండు టీవీలు కనెక్టివిటీ పరంగా, 3HDMI, 2USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్లతో వస్తాయి.
realme (40 inch) Full HD LED Smart: ధర రూ.22,999
realme (40 inch) Full HD LED Smart: ధర రూ.25,999
ఈ స్మార్ట్ టీవీల పైన డెబిట్ కార్డు మరియు క్రెడిట్ కార్డు తో కొనేవారికి 1,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. మే 4 వ తేదీ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ మరియు మే 5 వ తేదీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ స్మార్ట్ టీవీ అమ్మకానికి రానున్నాయి. Flipkart మరియు ఫ్లిప్ కార్ట్ అధికారిక వెబ్సైట్ నుండి ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు.