Realme TV: బడ్జెట్ ధరలో లేటెస్ట్ స్మార్ట్ టీవీ విడుదల చేసిన రియల్ మీ
రియల్ మీ తన కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేసింది
బడ్జెట్ ధరలో తగిన ఫీచర్లతో వచ్చింది
స్మార్ట్ క్వాడ్ కోర్ వంటి లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో వచ్చింది
ఈరోజు రియల్ మీ తన కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేసింది. రియల్ మీ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ కేవలం బడ్జెట్ ధరలో తగిన ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ టీవీ రియల్ మీ అధికారిక వెబ్సైట్ నుండి Flipkart నుండి అందుబాటులో ఉంటుంది. రియల్ మీ ఈ టీవీని Realme Smart TV Neo 32 పేరుతో ఆవిష్కరించింది మరియు ఈ స్మార్ట్ టీవీ యొక్క మొదటి సేల్ అక్టోబర్ 3వ తేదీ మద్యహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ Dolby Audio, క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ మరియు స్మార్ట్ క్వాడ్ కోర్ వంటి లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో వచ్చింది.
Realme Smart TV Neo 32: ప్రైస్&స్పెక్స్
ఈ లేటెస్ట్ రియల్ మీ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ సైజులో HD రెడీ రెజల్యూషన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ రూ.14,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యింది. అయితే, Flipkart The Big Billion Days Sale నుండి అఫర్ ధరకే సేల్ చేయనున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
ఈ రియల్ మీ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ టీవీ మంచి షార్ప్ కలర్స్ అందించడానికి Chroma Boost Picture Engineతో వస్తుంది. అద్భుతమైన కలర్స్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి Dolby Audi సౌండ్ టెక్నాలజీ కలిగిన 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయి. ఈ స్మార్ట్ టీవీ యొక్క డిస్ప్లే కళ్ళకు హానికలిగించదు. ఎందుకంటే, ఇది TUV Rheinland Low Blue Light సర్టిఫికేషన్ తో వస్తుంది.
ఇక కనెక్టివిటీ పరంగా, 2HMDI పోర్ట్స్, 1 USB పోర్ట్, 1LAN , 1AV కనెక్షన్ మరియు ఇది Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివుంది. టీవీ స్మార్ట్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు ఇన్ బిల్ట్ యూట్యూబ్ 2021 తో వస్తుంది.