Realme Smart Tv: రియల్‌మి నుండి మొట్టమొదటి SLED స్మార్ట్ టీవీ వచ్చేసింది
రియల్‌మి 55 అంగుళాల 4K HDR SLED TV ని భారతదేశంలో విడుదల చేసింది.
ఇది విస్తృత కలర్ గ్యామూట్ రేంజ్ అంధిస్తుంది
SLED TV మీ కంటికి రక్షణను అందిస్తుంది.
రియల్‌మి అధికారికంగా తన 55 అంగుళాల 4K HDR SLED TV ని భారతదేశంలో విడుదల చేసింది. బ్యాక్లైటింగ్ కోసం SLED ప్యానెల్ స్పెక్ట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (SPD) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నందున ఈ కొత్త 55-అంగుళాల 4K SLED టీవీ ప్రపంచంలోనే ఈ ప్రత్యేకతతో వచ్చిన మొట్టమొదటి టెలివిజన్ అవుతుంది. ఇది విస్తృత కలర్ గ్యామూట్ రేంజ్ అంధిస్తుంది మరియు బ్లూలైట్ నుండి రక్షణ కల్పిస్తుంది.
రియల్‌మి 55-అంగుళాల 4K HDR SLED TV ధర రూ .42,999 మరియు ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 16 నుంచి ప్రీ-ఆర్డర్ ద్వారా లభిస్తుంది. మొదటి అమ్మకం కోసం లాంచ్ ఆఫర్‌లో భాగంగా, అక్టోబర్ 16 నుండి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా ఈ టీవీ రూ .39,999 రూపాయల అఫర్ ధరతో లభిస్తుంది.
రియల్‌మి 55-Inch 4K HDR SLED TV ఫీచర్లు
రియల్‌మి 55-అంగుళాల 4K HDR SLED TV టివి కేవలం 9.5 మిల్లీమీటర్ల పరిమాణం గల అంచులను కలిగి ఉంది. ఈ రియల్‌మి టీవీ 94.6 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంది, మెటల్ స్టాండ్‌తో వస్తుంది మరియు బరువు 12.8 కిలోగ్రాములు.
4K (3840 x 2160 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే SLED ప్యానెల్‌ను ఉపయోగిస్తుంది, ఇది సహజ వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది మరియు బ్లూ లైట్ నుండి మీ కంటికి రక్షణను అందిస్తుంది. సాధారణ QLED ప్యానెల్ బ్లూలైట్ బ్యాక్‌లైటింగ్ వ్యవస్థను కలిగి ఉండగా, SLED ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం (RGB) బ్యాక్‌లైటింగ్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఇది మంచి రంగు ఖచ్చితత్వం, విస్తృత రంగు పునరుత్పత్తి పరిధిని పొందడానికి మరియు హానికరమైన నీలి కాంతి(బ్లూలైట్) నుండి మీ కళ్ళను రక్షిస్తుంది. ఇది 178-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ వరకు అందిస్తుంది.
ఈ రియల్‌మి స్మార్ట్ టీవీ 108 శాతం NTSC కలర్ గ్యామూట్ మరియు 1.07 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది. అంటే, స్క్రీన్ ఎక్కువ రంగులను ఖచ్చితంగా ఉత్పత్తి చేయగలదని అర్ధం. ఈ టీవీ క్రోమ్ బూస్ట్ పిక్చర్ ఇంజిన్‌తో క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు HDR10 + ప్లేబ్యాక్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9.0 టీవీలో నడుస్తుంది మరియు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మరియు మరిన్ని వంటి OTT యాప్స్ తో ముందే లోడ్ అవుతుంది.
Realme 55-అంగుళాల SLED టీవీలో 24W క్వాడ్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి, రెండు సెట్ల స్పీకర్లు దిగువన ఉన్నాయి. ఒక సెట్‌లో స్పీకర్ యూనిట్ మరియు ట్వీటర్ ఉంటాయి మరియు టీవీ యొక్క ఆడియో పనితీరు కూడా Dolby Audio మద్దతుతో మరింత చక్కగా వుంటుంది.
కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే, Realme టీవీ Chromecast, 2.4GHz మరియు 5GHz Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 లకు అంతర్నిర్మిత మద్దతును కలిగి ఉంది. అంతేకాకుండా, టీవీకి మూడు HDMI పోర్ట్‌లు, AV పోర్ట్, రెండు USB పోర్ట్‌లు, ఈథర్నెట్ పోర్ట్ మరియు Coaxial పోర్ట్ ఉన్నాయి.