రియల్ మీ తన డిజిటల్ ఈవెంట్ కోసం ఆహ్వానాలను పంపింది. విషయం ఏమిటంటే తన రాబోయే SLED TV ని ఈ ఈవెంట్ ద్వారా ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ఆన్‌లైన్-మాత్రమే. ఈ ఆన్లైన్ కార్యక్రమం Realme యొక్క ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ పేజీలలో ప్రసారం చేయబడుతుంది. మీడియాకు పంపిన ఆహ్వానం ఇలా ఉంది, “Leap to Next Gen'' యొక్క డిజిటల్ లాంచ్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించినందుకు మేము సంతోషిస్తున్నాము. ప్రముఖ డిస్ప్లే సాంకేతికతను కలిగి ఉన్న ప్రపంచంలోని మొట్టమొదటి SLED 4k TV (55 ”) ను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేస్తాము, అని తెలిపింది.
Realme రాబోయే SLED టీవీ యొక్క బ్యాక్‌లైటింగ్ కోసం ఉపయోగించే స్పెక్ట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (SPD) సాంకేతికతను కలిగి ఉంది, అయితే ఇది టీవీలో చూసే అనుభవాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనం నేరుగా చూసినప్పుడే మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు, మేము LED బ్యాక్‌లైటింగ్, OLED TV మరియు QLED TV లతో టీవీలను చూశాము. కాబట్టి, SLED మరియు ఇతర రకాల బ్యాక్‌లైటింగ్‌ల మధ్య ఏమైనా తేడా ఉందా అనే విషయం ఆసక్తికరంగా ఉంటుంది.
రియల్ మీ CEO మాధవ్ శేత్ ఈ టీవీని గురించి ట్విట్టర్‌లో టీజ్ చేశారు మరియు రియల్ మీ SLED బ్యాక్‌లైటింగ్ గురించి కొంత సమాచారాన్ని షేర్ చేశారు.
ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రియల్ మీ SLED TV మరింత సౌకర్యవంతమైన వీక్షణ అనుభవం కోసం TUV Rheinland తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. అంటే, కళ్ళకు హానికలిగించని విధంగా తక్కువ బ్లూ లైట్ తో వస్తుంది.
ఈ టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చిన తరువాత, OS మరియు ఇతర ఫీచర్లు మరియు మార్కెట్లో లభించే బడ్జెట్ స్మార్ట్ టీవీల నుండి(SLED కాకుండా) ఈ టీవీని ఎలా వేరు చేస్తాయో చూడాలి. 55-అంగుళాల 4K HDR TV టివి కోసం మార్కెట్లో ఎంచుకోవడానికి చాలా ఎంపికలు ఉన్నాయి. అయితే, కొత్త టెక్నాలజీతో వస్తున్న టీవీలను చూడలంటే మాత్రం కొన్ని మాత్రమే వున్నాయి.