PHILIPS ఒకేసారి 10 కొత్త టీవీలను విడుదల చేసింది. ఈ కొత్త టీవీలు HD Ready నుండి మొదలుకొని 4K UHD వరకు అన్ని సెగ్మెంట్స్ లో ఉన్నాయి. అంతేకాదు, HDR నుండి 4K UHD వరకూ HDR 10 +, Dolby Vision మరియు Dolby Atmos వంటి చాలా ఫీచర్లతో ఉన్నాయి. IPL సీజన్ ప్రధాన లక్ష్యంగా ఈ కొత్త టీవీ లను లాంచ్ చేసింది. వీటిలో, ఫిలిప్స్ 8200 మరియు 6900 సిరీస్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ OS తో వస్తుండగా, ఫిలిప్స్ 7600 మరియు 6800 సిరీస్ టీవీలు మాత్రం SAPHI smart OS పైన పనిచేస్తాయి.
ఫిలిప్స్ 8200 టీవీలు 50 ఇంచ్ స్క్రీన్ టీవీ రూ .79,990 ధరతో, 55 ఇంచ్ స్క్రీన్ టీవీ రూ. 89,990 ధరతో, 65 అంగుళాల టీవీని 1,19,990 ధరతో, 70 అంగుళాల మోడల్ ను రూ.1,49,990 రూపాయల ప్రైస్ తో మొత్తం నాలుగు స్క్రీన్ పరిమాణాలలో లభిస్తాయి.
ఇక ఫిలిప్స్ 7600 టీవీలు 50 అంగుళాల మోడల్ రూ .69,990 ధరతో, 58 అంగుళాల మోడల్ రూ .89,990 ధర వద్ద ప్రారంభమవుతాయి. ఫిలిప్స్ 6900 టీవీ సిరీస్ 32 అంగుళాల మోడల్ 27,990 ధర వద్ద , 43 అంగుళాల మోడల్ రూ .44,990 వద్ద ప్రారంభమవుతుంది. ఫిలిప్స్ 6800 టీవీ శ్రేణి 32 అంగుళాల మోడల్ రూ .21,990, 43 అంగుళాల మోడల్ రూ .35,990 వద్ద ప్రారంభమవుతుంది.
ఫిలిప్స్ ప్రకటించిన కొత్త టీవీ సిరీస్ ఇప్పుడు భారతదేశంలోని ప్రధాన ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ రిటైలర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
ఫిలిప్స్ 8200 టీవీలు డాల్బీ విజన్ మరియు Atmos కు మద్దతు కలిగి 4K UHD బోర్డర్‌లెస్ డిస్‌ప్లే ను కలిగి ఉన్నాయి మరియు HDR 10 + ప్లేబ్యాక్ సర్టిఫికేషన్ కలిగివుంది . ఈ టీవీలు P 5 పిక్చర్ ఇంజిన్ యొక్క శక్తిని కలిగి ఉంటాయి, ఇవి కలర్ , కాంట్రాస్ట్ మరియు మొత్తం ముఖ్యాంశాలను మెరుగుపరుస్తాయి. ఈ టీవీ వందలాది ఆండ్రాయిడ్ టీవీ యాప్స్ కు యాక్సెస్ అందించే గూగుల్ ప్లే స్టోర్‌తో ప్రీ ఇన్‌స్టాల్ చేయబడింది మరియు వాయిస్ ఆదేశాల కోసం గూగుల్ అసిస్టెంట్‌ను కూడా కలిగి ఉంది.
ఫిలిప్స్ 7600 టీవీలు 4K UHD స్క్రీన్ ను రెండు పరిమాణాల్లో కలిగి ఉంటాయి మరియు SAPHI smart OS పైన పనిచేస్తాయి. ఇది కస్టమ్ ఐకాన్ ఆధారిత మెనూతో వుంటుంది. ఈ టీవీలు HDR 10 +, డాల్బీ విజన్, అట్మోస్ కు మద్దతు ఇస్తాయి మరియు తక్కువ బెజెల్ కలిగి ఉంటాయి. 8200 సిరీస్ మాదిరిగా, ఫిలిప్స్ రూపొందించిన 7600 సిరీస్ కూడా P 5 పిక్చర్ ఇంజన్ ద్వారా శక్తి నిస్తుంది.
ఫిలిప్స్ 6900 టీవీ రేంజ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ మరియు Dolby Digital Plus తో ఈ ఆండ్రాయిడ్ టీవీ ఆధారితం. ఈ టీవీలు అంతర్నిర్మిత Chromecast మరియు పిక్సెల్ ప్లస్ HD సాంకేతికతకు మద్దతు ఇస్తాయి, ఇవి చిత్ర నాణ్యతను ఆప్టిమైజ్ చేస్తాయి మరియు స్ఫుటమైన విజువల్స్ అందిస్తాయి. ఇది 43-అంగుళాల మరియు 32-అంగుళాల రెండు స్క్రీన్ పరిమాణాలలో లభిస్తుంది.
ఫిలిప్స్ 6800 రేంజ్ టీవీలను రెండు సైజులలో అందిస్తున్నారు: ఇందులో ఒకటి 43-అంగుళాల ఫుల్ HD మరియు 32-అంగుళాల HD LED డిస్ప్లే మరియు ఇది కస్టమ్ SAPHI OS తో పనిస్తుంది. స్క్రీన్-మిర్రరింగ్ ఆండ్రాయిడ్ ఫోన్ ల కోసం అంతర్నిర్మిత మిరాకాస్ట్‌ను ఈ టీవీలు కలిగి ఉంటాయి.
ఈ కొత్త ఫిలిప్స్ టీవీ రేంజ్ భారతదేశం అంతటా 35,000+ స్టోర్లలో మరియు ప్రధాన ఆఫ్‌లైన్ స్టోర్ల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.