Oneplus ఏప్రిల్ 7 న ఇండియాలో ప్రకటించిన Oneplus Y1S Pro స్మార్ట్ టీవీ మొదటిసారి సేల్ కి వస్తోంది. రేపటి నుండి అందుబాటులోకి రానున్న ఈ వన్ ప్లస్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పైన భారీ ఆఫర్లను కూడా అందించింది. వాస్తవానికి, వన్ ప్లస్ కేవలం 30 కంటే తక్కువ ధరకే 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీని విడుదల చేసిన అందరిని ఆశ్చర్యపరిచింది.అంతేకాదు, ఈ వన్ ప్లస్ 4కే అల్ట్రా హైడెఫినేషన్ స్మార్ట్ టీవీ కొత్త బోర్డెర్ లెస్ డిజైన్, Dolby Audio మరియు HDR 10+ వంటి భారీ ఫీచర్లను కూడా కలిగివుంటుంది. రేపు మొదటిసారిగా అమ్మకానికి రానున్న ఈ బడ్జెట్ వన్ ప్లస్ 4K స్మార్ట్ టీవీ ఆఫర్లు మరియు స్పెక్స్ గురించి క్రింద చూడవచ్చు.
Oneplus Y1S Pro 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ రూ.29,999 ధరలతో వచ్చింది. ఈ స్మార్ట్ టీవీ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 2,500 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. ఏప్రిల్ 11 నుండి అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అమెజాన్ తో పాటుగా OnePlus.in, Croma, Jio Digital, Reliance Digital మరియు అన్ని ప్రధాన ఆఫ్ లైన్ స్టోర్ లలో కూడా లభిస్తుంది.
ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1S Pro ఫీచర్ల విషయానికి వస్తే, ఈ 43 ఇంచ్ సైజులో 4K (3840×2160) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ మరియు HLG సపోర్ట్ ను కలిగివుంది. TV Y1S Pro స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీతో 24W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది.
ఇక ఈ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ 4K స్మార్ట్ టీవీ Android 10 OS తో పనిచేస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI eArc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi, బ్లూటూత్ 5.0 మరియు వన్ ప్లస్ కనెక్ట్ 2.0 తో వస్తుంది.