Oneplus TV Y1S: వన్ ప్లస్ నుండి వస్తున్న మరొక స్మార్ట్ టీవీ
వన్ ప్లస్ మరొక స్మార్ట్ టీవీని విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది
వన్ ప్లస్ అప్ కమింగ్ టీవీ Oneplus TV Y1S
6 ప్రత్యేకతతో ఈ స్మార్ట్ టీవీ తీసుకువస్తునట్టు టీజింగ్
వన్ ప్లస్ కంపెనీ ఇండియాలో మరొక స్మార్ట్ టీవీని విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. Oneplus TV Y1S స్మార్ట్ టీవీ లాంచ్ గురించి ప్రకటించింది మరియు ఈ స్మార్ట్ టీవీ కోసం టీజింగ్ ను కూడా మొదలుపెట్టింది. TV Y1S స్మార్ట్ టీవీ ను 6 ఆకర్షణీయమైన ప్రత్యేకతతో తీసుకువస్తునట్టు ఈ టీజర్ నుండి అర్ధమవుతోంది. వన్ ప్లస్ ఈ TV Y1S స్మార్ట్ టీవీని ఫిబ్రవరి 17న ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇక ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1S గురించి టీజ్ చేస్తున్న 6 ప్రత్యేకతల వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ టీవీ అతి సన్నని అంచులను కలిగి ఉన్నట్లు చెబుతోంది మరియు టీజర్ పేజ్ ద్వారా ఈ విషయం మనకు కూడా అర్ధమవుతోంది. ఈ టీవిలో పవర్ ఫుల్ గామా ఇంజన్ అందించినట్లు, దీనిద్వారా స్పష్టమైన వివరాలను క్లియర్ గా చూడవచ్చని చెబుతోంది.
ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుందని కంపెనీ కూడా టీజర్ ద్వారా వెల్లడించింది. దీనితో పాటుగా ALLM (ఆటో లో లేటెన్సీ మోడ్) ని కూడా ఈ టీవిలో అందించింది. అంటే, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ )OS తో పాటుగా ల్యాగ్ ఫ్రీ మరియు మృధువైన అనుభావాన్ని అందిస్తుందని చెబుతోంది.
ఈ OnePlus స్మార్ట్ టీవీ, వన్ ప్లస్ స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ మరియు బ్లూటూత్ డివైజ్ లకు ఎటువంటి అంతరాయం లేని సీమ్ లెస్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవి పనిచేయనున్న Processor గురించి మాత్రం ఫిబ్రవరి 14 న రివీల్ చేయనున్నట్లు తెలిపింది.