Oneplus కొత్త స్మార్ట్ టీవీ వచ్చేస్తోంది..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!!
Oneplus 43 Y1S Pro స్మార్ట్ టీవీ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు టీజింగ్
HDR 10 డీకోడింగ్, AI Powered విజువల్స్
MEMC మరియు కంటెంట్ ఆప్టిమైజేషన్ సపోర్ట్ తో వస్తుంది
వన్ ప్లస్ సంస్థ మరొక కొత్త స్మార్ట్ టీవీని ఇండియాలో విడుదల చెయ్యడానికి సిద్దవుతున్నట్లు ప్రకటించింది. గత కొద్ధి కాలంగా, Y సిరీస్ నుండి 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఇప్పుడు ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ గురించి కొత్త సంగతులను కూడా తెలియచేసింది. త్వరలో ఈ వన్ ప్లస్ లాంచ్ చేయనున్నట్లు చెబుతున్న ఈ స్మార్ట్ టీవీ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. అంటే, ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ ద్వారా సేల్ అవుతుందని అర్ధం చేసుకోవచ్చు. వన్ ప్లస్ అతిత్వరలో విడుదల చేయబోతున్న Oneplus 43 Y1S Pro స్మార్ట్ టీవీ యొక్క రివీల్డ్ ఫీచర్లతో టీజింగ్ ను కూడా మొదలుపెట్టింది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ స్మార్ట్ టీవీని 43 ఇంచ్ సైజులో 4K UHD రిజల్యూషన్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టీవీని అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది మరియు ఈ స్మార్ట్ టీవీ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా వెల్లడించింది. ఈ టీవీని HDR 10 డీకోడింగ్, AI Powered విజువల్స్ మరియు అతి సన్నని అంచులతో తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ టీవీ విజువల్స్ మరింత అద్భుతంగా కనిపించేందుకు వీలుగా MEMC మరియు కంటెంట్ ఆప్టిమైజేషన్ సపోర్ట్ తో వస్తుంది.
Smarter is experiencing over watching. The bezel-less design with a 4K viewing experience makes the all-new OnePlus TV Y1S Pro definitely worth waiting for! Stay tuned: https://t.co/DjwCINyDqh#SmarterTVSmarterChoice #OnePlusTV pic.twitter.com/LUQA1ZjXQe
— OnePlus India (@OnePlus_IN) April 2, 2022
ఇక సౌండ్ పరంగా కూడా ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగిన 24W సుపీకర్లను కలిగివుంటుంది. అలాగే, ఇటీవల ఇదే సిరీస్ నుండి వచ్చిన టీవీల మాదిరిగా గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉండవచ్చు.
ఇక ఇటివల ఇండియాలో విడుదల చేసిన Oneplus TV Y1S సిరీస్ నుండి వచ్చిన 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ సైజులో వచ్చిన స్మార్ట్ టీవీల గురించి ఈ క్రింద చూడవచ్చు.
Oneplus TV Y1S: ఫీచర్లు
ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1S ఫీచర్ల విషయానికి వస్తే, 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366×768) రిజల్యూషన్ తో వస్తే, 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ (1920×1080) రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ సపోర్ట్ ను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. TV Y1S రెండు స్మార్ట్ టీవీలు కూడా Dolby Audio సౌండ్ టెక్నాలజీ కలిగివుంటాయి మరియు 20W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తాయి.
ఇక ఈ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ రెండు స్మార్ట్ టీవీలు కూడా Android 11 OS తో పనిచేస్తాయి. ఈ టీవీలకు బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI Arc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది.