Oneplus కొత్త టీవీ రూ.21,999 ధరకే విడుదల

Oneplus కొత్త టీవీ రూ.21,999 ధరకే విడుదల
HIGHLIGHTS

ఇండియాలో వన్ ప్లస్ తన కొత్త స్మార్ట్ టీవీని ఈరోజు ప్రకటించింది

OnePlus 40Y1 స్మార్ట్ టీవీ ని 40 ఇంచ్ సైజులో విడుదల చేసింది

ఈ స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ మరియు 20W పెద్ద సౌండ్ తో పాటుగా చాలా ఫీచర్లతో వస్తుంది

ఇండియాలో వన్ ప్లస్ తన కొత్త స్మార్ట్ టీవీని ఈరోజు ప్రకటించింది. ఇప్పటికే 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ స్మార్ట్ టీవీలను అందించిన Oneplus Y సిరీస్ నుండి ఈ కొత్త స్మార్ట్ టీవీ OnePlus 40Y1 స్మార్ట్ టీవీ ని 40 ఇంచ్ సైజులో విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ మరియు 20W పెద్ద సౌండ్ తో పాటుగా చాలా ఫీచర్లతో వస్తుంది. ఈ OnePlus 40Y1 స్మార్ట్ టీవీని కేవలం రూ.21,999 రూపాయల ధరకే ప్రకటించింది.

OnePlus 40Y1: ప్రత్యేకతలు

ఈ OnePlus 40Y1 స్మార్ట్ టీవీ 1980×1080 పిక్సెల్ రిజల్యూషన్ తో వుంటుంది. అంటే, ఇది FHD స్మార్ట్ టీవీ అన్నమాట. ఈ వన్ ప్లస్ కొత్త టీవీ వైడ్ కలర్ గ్యాముట్ తో వస్తుంది. ఇది వన్ ప్లస్ ఆక్సిజన్ ప్లే UI మరియు ఆండ్రాయిడ్ టీవీ UI తో కూడా పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 తో పనిచేస్తుంది మరియు గూగుల్ అసిస్టెంట్ తో వుంటుంది. ఈ టీవిలో ప్లే స్టోర్ నుండి వేల యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రైమ్ వీడియో , Netflix, Hotstar వంటి అన్ని పాపులర్ యాప్స్ నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ టీవీ తక్కువ అంచులు కలిగి ఎక్కువ స్క్రీన్ ఏరియాతో వుంటుంది. అంటే, చాలా సన్నని అంచులను కలిగి ఉంటుంది. ఇది 20W డాల్బీ ఆడియో సౌండ్ అందించ గల బాక్స్ స్పీకర్లను కలిగి వుంటుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ కనెక్టివిటీ పరంగా ,WiFi, 2 HDMI, 2USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వుంది. Flipakrt లో లిస్ట్ చెయ్యబడిన ఈ వన్ ప్లస్ కొత్త టీవీ మే 26 మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మకాలను సాగిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo