Oneplus TV: కొత్త స్మార్ట్ TV లాంచ్ చేస్తున్న వన్ ప్లస్ సంస్థ
వన్ ప్లస్ సంస్థ తన కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది.
Oneplus TV 40Y1 మోడల్ నంబర్ తో ఈ స్మార్ట్ టీవీని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
Flipkart నుండి ఇప్పటికే టీజింగ్ ని కూడా మొదలు పెట్టింది
Oneplus TV: ఇండియాలో వన్ ప్లస్ సంస్థ తన కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది. మే 24 న మధ్యాహ్నం 12 గంటలకి Oneplus TV 40Y1 మోడల్ నంబర్ తో ఈ స్మార్ట్ టీవీని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. Flipkart నుండి ఇప్పటికే టీజింగ్ ని కూడా మొదలు పెట్టింది మరియు ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా సేల్ చెయవచ్చు.
వన్ ప్లస్ Y సిరీస్ నుండి 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ స్మార్ట్ టీవీలను మార్కెట్లో ప్రవేశపెట్టగా, ఇప్పుడు ఈ సిరీస్ నుండి 40 ఇంచ్ స్మార్ట్ టీవీని విడుదల చేస్తోంది. ఈ లేటెస్ట్ టీవీని కూడా భారీ ఫీచర్లతోనే తీసుకువస్తోంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ కూడా సన్నని అంచులు, అంటే బెజెలెస్ డిజైన్ ఆక్సిజన్ ప్లే, వైడ్ కలర్ గ్యామ్యూట్, గామా ఇంజన్ మరియు Dolby Audio సపోర్ట్ తో ప్రకటించవచ్చు.
ముందుగా వచ్చిన వన్ ప్లస్ టీవీల మాదిరిగానే 20W బాక్స్ స్పీకర్లతో మంచి సౌండ్ ని కూడా ఈ టీవిలో పొందవచ్చు. ఇక ఇన్ బిల్ట్ cromecast, ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ప్లే స్టోర్ యాప్స్ వంటివి ఉంటాయి. ఇక వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్ నుండి అయితే, వన్ ప్లస్ టీవీ Y సిరీస్ Y1 నుండి 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ టీవీల పైన ఆఫర్లను కూడా ప్రకటించింది. SBI క్రెడిట్ కార్డు మరియు EMI ట్రాన్సక్షన్ పైన 1500 రూపాయల తగ్గింపును అఫర్ చేస్తోంది.