Oneplus Y1S Pro సిరీస్ నుండి గతంలో 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ లాంచ్ చేసిన వన్ ప్లస్ ఈరోజు 50 ఇంచ్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. Oneplus 50 Y1S Pro మోడల్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ టీవీని తక్కువ ధరకే మార్కెట్లో ప్రవేశపెట్టింది. వన్ ప్లస్ ఈ కొత్త 4కే అల్ట్రా హైడెఫినేషన్ స్మార్ట్ టీవీని Dolby Audio మరియు HDR 10+ సపోర్ట్ వంటి ఫీచర్లతో పాటుగా బోర్డెర్ లెస్ డిజైన్ తో అందించింది. వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ యొక్క వివరాల పైన ఒక లుక్ వేయండి.
Oneplus 50 Y1S Pro 4K UHD స్మార్ట్ టీవీని రూ.32,999 ధరతో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ టీవీ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీని Axis Bank క్రెడిట్/ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 3,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ మొదటి సేల్ జూలై 7వ తేదీ 12 గంటలకి మొదలవుతుంది. అమెజాన్ తో పాటుగా OnePlus.in మరియు అన్ని ప్రధాన ఆఫ్ లైన్ స్టోర్ లలో కూడా లభిస్తుంది.
ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ 50 Y1S Pro ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 50 ఇంచ్ సైజులో 4K (3840×2160) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ Gamma ఇంజిన్ తో HDR 10, HDR 10+ మరియు HLG సపోర్ట్ ను కలిగివుంది. 50 TV Y1S Pro స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీతో 24W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది.
ఇక ఈ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ 4K స్మార్ట్ టీవీ Android 10 OS తో పనిచేస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI eArc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi, బ్లూటూత్ 5.0 మరియు వన్ ప్లస్ కనెక్ట్ 2.0 తో వస్తుంది.